నమ్రత మేడమ్ కు టైమ్ దొరికింది

ఎవరు ఎంత ఖండించినా, ఎవరు కాదన్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు తరపున అన్ని పనులు చకచకా మేనేజ్ చేసేది మేడమ్ నమ్రతనే.  Advertisement ఇటు మహేష్ వ్యాపారాలకు సంబంధించిన మీటింగ్ లు, ప్లానింగ్…

ఎవరు ఎంత ఖండించినా, ఎవరు కాదన్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు తరపున అన్ని పనులు చకచకా మేనేజ్ చేసేది మేడమ్ నమ్రతనే. 

ఇటు మహేష్ వ్యాపారాలకు సంబంధించిన మీటింగ్ లు, ప్లానింగ్ లు, మహేష్ కు నిర్మాతలకు మధ్య మాటలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు అన్నీ నమ్రతనే. అలాంటి నమ్రతకు ఇప్పుడు టైమ్ దొరికింది. 

మహేష్ బాబు విదేశాల్లో తన ఫ్రెండ్స్ తో వున్నారు. బాడీ స్ట్రెంగ్త్ కు సంబంధించి ఓ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ నెల 16 వరకు రారు. పిల్లల చదువులు అవీ వుండడంతో నమ్రత వాళ్లని తీసుకుని ఇక్కడకు వచ్చేసారు. దాదాపు రెండు వారాల ఫ్రీ టైమ్ దొరికింది.

నమ్రతకు హైదరాబాద్ లో హై ఫై లేడీస్ సర్కిల్ కాస్త ఎక్కువే వుంది. కిట్టీ పార్టీలు మామూలుగా వుండవు. కానీ వాటికి అటెండ్ అయ్యే సమయమే తక్కువ. అందుకే ఇప్పుడు నమ్రత ఈ ఫ్రీ టైమ్ ను బాగా వాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన కిట్టీ పార్టీ బ్యాచ్ లు,హై ఫై లేడీస్ సర్కిల్ పార్టీలతో నమ్రత టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ వెనక్కు వస్తే మళ్లీ ఎలాగూ బిజీ అయిపోతారు. అందుకే తన సర్కిల్ జనాలను అందరినీ ఓ సారి కలిసి, హాయ్..బాయ్ చెప్పేస్తున్నారట. నమ్రతకు ఫ్రీ టైమ్ దొరికిందని తెలియడంతో ఆమె సర్కిల్ జనాలు కూడా పార్టీల మీద పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారట.