రవితేజ డిమాండ్ మామూలుగా లేదు

టాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా వుందన్న నేపథ్యంలో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ పావలా, అర్థరూపాయి ప్రకటన ఖర్చుల దగ్గర బేరాలు ఆడుతున్న వ్యవహారం ఒక పక్క సాగుతుంటే, సంచి లాభం చిల్లి కూడదీసింది అన్న చందంగా,…

టాలీవుడ్ పరిస్థితి అగమ్య గోచరంగా వుందన్న నేపథ్యంలో, ప్రొడ్యూసర్స్ గిల్డ్ పావలా, అర్థరూపాయి ప్రకటన ఖర్చుల దగ్గర బేరాలు ఆడుతున్న వ్యవహారం ఒక పక్క సాగుతుంటే, సంచి లాభం చిల్లి కూడదీసింది అన్న చందంగా, హీరోల రెమ్యూనిరేషన్ లు భయంకరంగా పెరిగిపోతున్నాయి.

ప్రొడ్యుసర్స్ గిల్డ్ లీడర్ దిల్ రాజు నే తన ఎఫ్ 3 సినిమాకు భారీ రెమ్యూనిరేషన్లు ఇచ్చుకోక తప్పలేదని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో హీరో రవితేజ కూడా రేటు పెంచేసారని వినిపిస్తోంది.

సింగిల్ పేమెంట్ తీసుకుని రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడీ సినిమా చేస్తున్నారు. టాగోర్ మధు క్రాక్ సినిమాకు మంచి బజ్ వుంది. దీంతో తరువాత తనతో ఎవరైనా సినిమా చేయాలంటే 12 కోట్లు ఇవ్వాలని రవితేజ కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాప్ హీరోలు ఎవ్వరూ ఖాళీ లేరు. కాస్త కలెక్షన్ లాగగల హీరోలు లేకపోతే ఎంత గొప్ప డైరక్టర్ అయినా చేయగలిగింది లేదు. అందుకే హీరోలకు ఈ డిమాండ్ వుంది. రవితేజలో సినిమా చేయాలనుకుంటున్నవారు ఇప్పుడు కిందా మీదా అవుతున్నారట.

క్రాక్ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూసి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారట. కానీ అక్కడా సమస్య వుంది. క్రాక్ కనక గట్టి హిట్ అయితే 12 కోట్ల డిమాండ్ 13 అయిపోయినా ఆశ్చర్యం లేదు. 

అటూ ఇటూ ఎటూ కాలేక!