నాగచైతన్య నుంచి ముందుగా వచ్చే సినిమా ఏది?

కెరీర్ లో గ్యాప్ తీసుకోవడం నాగచైతన్యకు ఇష్టం ఉండదు. నిత్యం ఏదో ఒక సినిమా సెట్స్ పై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కుదిరితే ఒకేసారి 2 సినిమాలు కూడా చేస్తుంటాడు. అయితే నాగచైతన్య నెక్ట్స్…

కెరీర్ లో గ్యాప్ తీసుకోవడం నాగచైతన్యకు ఇష్టం ఉండదు. నిత్యం ఏదో ఒక సినిమా సెట్స్ పై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కుదిరితే ఒకేసారి 2 సినిమాలు కూడా చేస్తుంటాడు. అయితే నాగచైతన్య నెక్ట్స్ మూవీ ఏంటనే అంశంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చైతూ నుంచి అధికారిక ప్రకటన కూడా రాలేదు.

ప్రస్తుతం థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సినిమా తర్వాత నాగచైతన్య ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడనే కన్ఫ్యూజన్ అందరిలో ఉంది.

ప్రస్తుతం నాగచైతన్య చేతిలో 2 సినిమాలున్నాయి. వీటిలో ఒకటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా చేయాలి. దీంతో పాటు డీవీవీ దానయ్య బ్యానర్ లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ సబ్జెక్ట్ రాబోతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోయేది సాఫ్ట్ లవ్ సబ్జెక్ట్. ఈ రెండు జానర్లలో ఏ జానర్ సినిమాను ముందుగా స్టార్ట్ చేయాలనేది నాగచైతన్య ఇంకా నిర్ణయించుకోలేదు.