డేటింగ్ రూమర్స్.. తప్పు చేయలేదన్న హీరోయిన్

హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతూ ఫొటో దిగితే వెనక…

హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతూ ఫొటో దిగితే వెనక శోభిత కనిపించడంతో, ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. దీనికితోడు సమంత స్టేట్ మెంట్ ను, శోభితకు ముడిపెడుతూ కూడా కొన్ని కథనాలు వచ్చాయి.

వీటన్నింటిపై తాజాగా నాగచైతన్య రియాక్ట్ అయ్యాడు. సంబంధం లేని మూడో వ్యక్తిని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నాడు. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై శోభిత కూడా స్పందించింది. తను ఏ తప్పు చేయలేదని, అలాంటప్పుడు వివరణ ఎందుకు ఇవ్వాలని అంటోంది శోభిత.

“నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు అర్జెంట్ గా మీడియా ముందుకొచ్చి నాపై వచ్చిన పుకార్లపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. నాకు అలా క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదు. నేను ఏ తప్పు చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి, మంచిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇదే నా ఫోకస్.”

నటీనటులపై పుకార్లు రావడం సహజమని అభిప్రాయపడింది శోభిత. జీవితంలో ఏం కావాలనే ఫోకస్ ఉన్నప్పుడు, ఇలాంటి పుకార్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది.

“మంచి సినిమాలు చేస్తున్నాను. చిన్నప్పట్నుంచి డాన్స్ ఇష్టం. నేను క్లాసికల్ డాన్సర్ ని. మణిరత్నం సినిమాలో రెహ్మాన్ మ్యూజిక్ కు డాన్స్ చేయడంతో నా కల నెరవేరింది. ఓవైపు ఇన్ని స్పెషల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఎవరో ఒకరిద్దరు తెలియకుండా ఏదో మాట్లాడతారు. దాన్ని పట్టించుకొని, అంత ఫీల్ అయిపోవడానికేం లేదు.”

ఇలా తనపై వస్తున్న పుకార్లను లైట్ తీసుకుంది శోభిత. మిగతా హీరోయిన్లతో పోలిస్తే, తనపై పుకార్లు చాలా తక్కువగా వస్తుంటాయని, ఈ విషయంలో దేవుడికి థ్యాంక్స్ చెప్పింది.