మళ్లీ మరో ఊరి కథ

రుద్రవనం అనే ఊరి కథను విరూపాక్షలో జనాలు చూసారు. కాసులు కురిపించారు. ఇప్పుడు మరో ఊరి కథ తెరమీదకు వస్తోంది. ఊరి పేరు భైరవకోన. రాజేష్ నిర్మాత, విఐ ఆనంద్ దర్శకుడు.  Advertisement ఇలాంటి…

రుద్రవనం అనే ఊరి కథను విరూపాక్షలో జనాలు చూసారు. కాసులు కురిపించారు. ఇప్పుడు మరో ఊరి కథ తెరమీదకు వస్తోంది. ఊరి పేరు భైరవకోన. రాజేష్ నిర్మాత, విఐ ఆనంద్ దర్శకుడు. 

ఇలాంటి మిస్టిక్ థ్రిల్లర్లు తీయడంలో మంచి హ్యాండ్. ఈ సినిమా టీజర్ వచ్చింది. ఒక మిస్టరీ ఊరి కథ అనాలో..లేక ఓ ఊరిలో నెలకొన్న మిస్టరీల కథ అనాలో..మొత్తానికి మిస్టరీ థ్రిల్లర్. విఐ ఆనంద్ కు ఇలాంటి సబ్జెక్ట్ ల మీద మంచి పట్టు వుంది. ఆ పట్టు టీజర్ లో కనిపిస్తోంది.

విజువల్స్ అవీ బాగున్నాయి. మంచి థ్రిల్లర్ ను చూడబోతున్నామన్న కలర్ ను ఇచ్చాయి. కానీ ఒకటే సమస్య విరూపాక్ష సినిమా చూసి ఇంకా ఎన్నో రోజులు కాలేదు. దాంతో ఇంకా ఆ సినిమా కళ్ల మందు నుంచి దూరం కాలేదు. ఆ ప్రభావం ఈ టీజర్ మీద పడే అవకాశం అయితే వుంది. సినిమా విడుదలకైనా కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్.

ఆ సంగతి పక్కన పెడితే టీజర్ కట్, టెక్నికల్ క్వాలిటీ బాగుంది. గరుడపురాణంలో మిస్సయిన పేజీలే ఈ భైరవకోన అని చెప్పడం ద్వారా తప్పు చేసిన వారికి భైరవకోనలో కొత్త కొత్త శిక్షలు వుంటాయన్నమాట. ఈ తప్పులు, ఆ శిక్షలు, టోటల్ మిస్టరీనే సినిమా కావచ్చు.