వైరల్ వీడియో.. గడ్డకట్టే చలిలో బికినీలో రకుల్

ఎముకలు కొరికే చలి హీరోయిన్లకు కొత్తేంకాదు. పాటల షూటింగ్ కోసం మంచు కొండల్లో డాన్స్ చేసిన అనుభవం చాలామంది హీరోయిన్లకు ఉంది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో ఆ చలి వాతావరణంలో తామెంత కష్టపడ్డామో కూడా…

ఎముకలు కొరికే చలి హీరోయిన్లకు కొత్తేంకాదు. పాటల షూటింగ్ కోసం మంచు కొండల్లో డాన్స్ చేసిన అనుభవం చాలామంది హీరోయిన్లకు ఉంది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో ఆ చలి వాతావరణంలో తామెంత కష్టపడ్డామో కూడా గర్వంగా చెప్పుకుంటారు. కానీ హీరోయిన్ రకుల్ మాత్రం అంతకుమించి అన్నట్టు వ్యవహరించింది.

ఎటుచూసినా మంచు, చెట్లు కూడా మోడుబారిపోయాయి, మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్. ఫుల్లుగా కప్పుకుంటే తప్ప అలాంటి వాతావరణంలో ఉండలేం. అందరూ అలానే ఉన్నారు కూడా. కానీ రకుల్ మాత్రం అన్నీ విప్పేసింది. టూ-పీస్ బికినీలోకి మారిపోయింది.

అలా బికినీతో బయటకొచ్చి, మంచు కింద ఉన్న నీటిలోకి దిగింది. పీకల్లోతు వరకు మునిగి బయటకొచ్చింది. గడ్డకట్టే చలిలో అలా నీటిలో దిగడం నిజంగా సాహసమే. కానీ రకుల్ మాత్రం నవ్వుతూ ఈ ఫీట్ సాధించింది.

దీన్ని క్రియో థెరపీ అంటారు. ఇలా ఉన్నఫలంగా గడ్డకట్టే చలిలోకి వెళ్లడం వల్ల చర్మ సమస్యలు, కండరాలు-నరాల సమస్యల నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. మొన్నటికిమొన్న సమంత కూడా ఇదే పని చేసింది. ఐస్ క్యూబ్స్ మధ్యలో పడుకుంది. ఇప్పుడు రకుల్ సహజసిద్ధ వాతావరణంలో ఈ పని చేసింది.

అయితే ఈ హీరోయిన్ సరదాగా ఈ పని చేసిందా లేక పైన చెప్పుకున్న ఏదైనా సమస్యతో బాధపడుతుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా మారింది.