గోపీచంద్ పరువుతీసిన రామబాణం

రామబాణం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందనేది వాస్తవం. ఈరోజు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆక్యుపెన్సీ లేదనేది కూడా అంతే వాస్తవం. కానీ ఇక్కడ మేటర్ అది కాదు. గోపీచంద్ సినిమా కోసం ఓ…

రామబాణం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందనేది వాస్తవం. ఈరోజు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆక్యుపెన్సీ లేదనేది కూడా అంతే వాస్తవం. కానీ ఇక్కడ మేటర్ అది కాదు. గోపీచంద్ సినిమా కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. గోపీచంద్ నుంచి మాస్ ఆశిస్తారు వాళ్లంతా. అలాంటి జనం కూడా రామబాణం మొదటి రోజు డుమ్మా కొట్టేశారు. లెక్కలతో సహా బయటపడిన వాస్తవం ఇది.

గోపీచంద్ సినిమాలకు రిజల్ట్ తో సంబంధం లేకుండా మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. గడిచిన 5-6 సినిమాల ఓపెనింగ్స్ చూస్తే, ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఈ హీరో సినిమా కోసం ఓ సెక్షన్ ఆడియన్స్ వస్తున్నారనేది నిజం. కానీ రామబాణం సినిమాకు ఆ జనం కూడా రాలేదు. ఈ సినిమాకు మొదటి రోజు కోటి రూపాయల కంటే కాస్త ఎక్కువగా మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో షేర్ వచ్చింది.

గడిచిన ఐదేళ్లుగా చూసుకుంటే, గోపీచంద్ కెరీర్ లోనే లీస్ట్ ఓపెనర్ గా నిలిచిన సినిమా చాణక్య. ఎందుకో ఆ సినిమాకు పెద్దగా ఓపెనింగ్స్ రాలేదు. అటుఇటుగా కోటి రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఆ తర్వాత స్థానం రామబాణం సినిమాదే.

ఈ హీరో నటించిన పక్కా కమర్షియల్, సీటీమార్, గౌతమ్ నంద, పంతం సినిమాలన్నీ మొదటి రోజు రెండున్నర కోట్లకు పైగా షేర్లు తెచ్చుకున్నాయి. భారీగా ప్రచారం చేసినప్పటికీ రామబాణం సినిమా 2 కోట్ల మార్కు అందుకోలేకపోయింది.

ఈ సినిమా బయ్యర్లకు ఎంత నష్టం తెచ్చిపెడుతుంది, నిర్మాతకు ఎంత డ్యామేజీ చేస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. తాజా వసూళ్లతో గోపీచంద్ తన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీని కోల్పోతున్నాడేమో అనిపిస్తోంది. ఇకనైనా ఈ హీరో స్క్రిప్టుల విషయంలో కాస్త సీరియస్ గా, మొహమాటాలకు దూరంగా ఉంటే బెటర్.