అఖిల్ స్కిప్ చేశాడు.. నాగచైతన్య చెప్పేశాడు

నాగచైతన్య, అఖిల్ కోసం నాగార్జున ఏం చేస్తున్నారు? మంచి దర్శకుల్ని సెట్ చేయొచ్చు కదా? అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై కొడుకును హీరోగా భారీ ప్రాజెక్టులు తీసుకురావొచ్చు కదా? మెగా కాంపౌండ్ తమ వారసుల్ని…

నాగచైతన్య, అఖిల్ కోసం నాగార్జున ఏం చేస్తున్నారు? మంచి దర్శకుల్ని సెట్ చేయొచ్చు కదా? అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై కొడుకును హీరోగా భారీ ప్రాజెక్టులు తీసుకురావొచ్చు కదా? మెగా కాంపౌండ్ తమ వారసుల్ని పట్టించుకునే రేంజ్ లో నాగ్ ఎందుకు చైతూ, అఖిల్ ను పట్టించుకోవడం లేదు?

అక్కినేని ఫ్యాన్స్ నుంచి తరచుగా వినిపించే కంప్లయింట్స్ ఇవి. ఇవే ప్రశ్నల్ని ఈమధ్య అఖిల్ కు అడిగితే సరైన సమాధానం రాలేదు. నాన్న ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని చెప్పాడు తప్ప, మరింత లోతుగా చెప్పలేదు. నాగచైతన్య మాత్రం ఈ విషయంపై సూటిగా స్పందించాడు. నాన్నది తప్పులేదని, తామే ఎప్పుడూ నాన్నను అడగలేదని విస్పష్టంగా సమాధానం ఇచ్చాడు.

“నేను ఇప్పటికిప్పుడు నాన్నకు ఫోన్ చేసి, ఫలానా దర్శకుడితో చేయాలని ఉంది, ప్రాజెక్ట్ సెట్ చేయమని చెబితే, వెంటనే కారు ఎక్కి, ఆ దర్శకుడి ఆఫీస్ కు వెళ్లి, నాన్న సినిమా సెట్ చేశారు. ఎప్పుడూ ఈ విషయంలో నాన్న మాకు నో చెప్పరు. నిజానికి ఈ విషయంలో మమ్మల్ని (నాగచైతన్య, అఖిల్) నాన్న చాలాసార్లు అడిగారు కూడా. ఏ దర్శకుడు కావాలో చెప్పండి, స్టుడియో నుంచి అడ్వాన్సులు పంపిస్తాంటూ చాలా అవకాశాలిచ్చారు. ఈ విషయంలో నాన్న తప్పు ఏమాత్రం లేదు, మేమే సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో నాన్న మీద డిపెండ్ అవ్వలేదు.”

అమ్మా-నాన్న సపోర్ట్ చేయలేదని అనడం కరెక్ట్ కాదని, వాళ్ల నుంచి తమకు కంప్లీట్ సపోర్ట్ ఉందని, కాకపోతే అది వేరే విధంగా ఉంటుందని స్పష్టం చేశాడు నాగచైతన్య. సొంత నిర్ణయాలు తీసుకొని, వాటి నుంచి నేర్చుకోవాలనే పద్ధతిని ఇంట్లో ఫాలో అవుతామని తెలిపాడు.

“సినిమాలకు సంబంధించిన డిస్కషన్ ఇంట్లో ఉంటుంది. మేం చర్చించుకుంటాం. కానీ నాన్న మమ్మల్ని ఇలానే పెంచారు. తాతగారు కూడా నాన్నగారితో ఇలానే ఉండేవారు. డెసిషన్స్ మేమే తీసుకుంటాం, తప్పయితే ఫెయిల్ అవుతాం, కానీ ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకుంటాం. ఆ తర్వాత ఓ టైమ్ లో సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఓ ఫెయిల్యూర్ ను సొంతంగా హ్యండిల్ చేస్తే వచ్చే అనుభవం ఎక్కడా దొరకదు.”

గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా తన మనసులో భావాలు బయటపెట్టిన నాగచైతన్య, దర్శకుడు పరశురామ్ పై కూడా అంతే సూటిగా స్పందించాడు. తనతో సినిమా చేస్తానని చెప్పి డ్రాప్ అయిన పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అన్నాడు. తన టైమ్ అంతా వృధా చేశాడని ఆరోపించాడు. నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు ఈ అక్కినేని హీరో.