పుష్ప‌-3…త‌గ్గేదే అంటున్నాడే!

పుష్ప‌-1…ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పే త‌గ్గేదే లే అనే డైలాగ్ చాలా పాపుల‌ర్ అయ్యింది. ఏదైనా స‌రే, త‌గ్గేదే లేద‌ని చెప్ప‌డం ప్యాష‌న్ అయ్యింది. అదేంటో గానీ, పొలిటిక‌ల్ హీరోగా ఆయ‌న…

పుష్ప‌-1…ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పే త‌గ్గేదే లే అనే డైలాగ్ చాలా పాపుల‌ర్ అయ్యింది. ఏదైనా స‌రే, త‌గ్గేదే లేద‌ని చెప్ప‌డం ప్యాష‌న్ అయ్యింది. అదేంటో గానీ, పొలిటిక‌ల్ హీరోగా ఆయ‌న అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం త‌గ్గేదే అని అంటున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పుష్ప‌-3 హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌గ్గేదే అంటూ ప్ర‌త్య‌ర్థులు సెటైర్స్ విసురుతున్నారు.

జ‌నంలోకి వెళ్లేందుకంటూ వారాహి పేరుతో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాలా కాలం క్రిత‌మే ప్ర‌చార వాహ‌నాన్ని సిద్ధం చేసుకున్నారు. జ‌నానికి దాని ప‌రిచ‌య‌మే సినిమాటిక్‌గా చేసిన సంగ‌తి తెలిసిందే. కొండ‌గ‌ట్టులో వారాహి ర‌థానికి ప్ర‌త్యేకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూజ‌లు చేయించారు. వారాహిపై జ‌నంలోకి త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌స్తున్నారంటూ… జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రోజుకో డేట్ ప్ర‌క‌టిస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ వారాహి మాత్రం జ‌నంలోకి రావ‌డం లేదు. ఆ మ‌ధ్య మ‌చిలీప‌ట్నం స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు మాత్రం వారాహిపై ప‌వ‌న్ వెళ్లారు. ఆ త‌ర్వాత వారాహిని ఎక్క‌డ దాచారో ఎవ‌రికీ తెలియ‌దు. వారాహిపై ప‌వ‌న్ వ‌స్తే, ద‌త్త త‌మ్ముడు లోకేశ్‌పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌నే భ‌యమే ఆయ‌న్ను తిర‌గ‌నివ్వ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. చంద్ర‌బాబు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తే త‌ప్ప వారాహి జ‌నంలోకి రాద‌ని ప్ర‌త్య‌ర్థులు దెప్పి పొడుస్తున్నారు.

అలాగే ఎన్నిక‌ల్లో సింగిల్‌గా పోటీ చేయడంపై…. పుష్ప‌-3 హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌గ్గేదే అంటున్నాడ‌ని వ్యంగ్య డైలాగ్‌ల‌తో వైసీపీ నేతలు వెట‌క‌రిస్తున్నారు. 

ఫుల్ టైమ్ రాజ‌కీయాలు చేయ‌వ‌య్యా అంటే…ఊహూ, ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేయ‌మంటే ఊహూ, వారాహిపై ర‌మ్మంటే ఊహూ, పొత్తుల్లేకుండా పోటీ చేయ‌మంటే ఊహూ, ఇక ఏం చేస్తావ‌య్యా ప‌వ‌న్ అని అడిగితే… చంద్ర‌బాబును మోయ‌డానికి మాత్రం ఊ కొడుతున్నార‌ని పుష్ప సినిమాలో స‌మంత ఊ అంటావా, ఊహూ అంటావా పాట‌తో పోల్చుతూ ప‌వ‌న్‌పై ఓ రేంజ్‌లో నెటిజ‌న్లు ట్రోలింగ్ చేస్తున్నారు.