కళ్యాణ్ రామ్ చేసి వుంటే..

యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో చెలరేగిపోయాడు అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో. అల్లరి నరేష్ బాగా చేసాడు అన్నవాళ్లూ వున్నారు. అల్లరి నరేష్ కాకుండా మరెవరైనా అయివుంటే అని అనేవారూ వున్నారు. గమ్మత్తేమిటంటే…

యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో చెలరేగిపోయాడు అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో. అల్లరి నరేష్ బాగా చేసాడు అన్నవాళ్లూ వున్నారు. అల్లరి నరేష్ కాకుండా మరెవరైనా అయివుంటే అని అనేవారూ వున్నారు. గమ్మత్తేమిటంటే ఉగ్రం కథ ముందుగా వేరే హీరో దగ్గరకు కూడా వెళ్లింది. ఆ హీరో ఎవరో కాదు..నందమూరి కళ్యాణ్ రామ్.

ఇలాంటి యాంగ్రీ పోలీస్ క్యారెక్టర్లకు పెర్ ఫెక్ట్ ఫిట్. ఉగ్రం చూసిన తరువాత కూడా కళ్యాణ్ రామ్ పక్కా ఫిట్ అనే అంటారు ఎవరైనా. కానీ ఎందుకో కళ్యాణ్ రామ్ మాత్రం ఓకె అనలేకపోయారు. 

సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు సూచించారని బోగట్టా. అక్కడ డైరక్టర్-కళ్యాణ్ రామ్ అభిప్రాయాలు సింక్ కాలేదు. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ వేరే హీరో దగ్గరకు వెళ్లిపోయింది.

నిజానికి కళ్యాణ్ రామ్ అయి వుంటే ఉగ్రం సినిమాకు మరింత క్రేజ్ వచ్చి వుండేది. అది వాస్తవం. పైగా ఈ యాంగ్రీ లుక్ కు, మాస్ ఇమేజ్ కు కళ్యాణ్ రామ్ అయితే మరింత ప్లస్ అయి వుండేది. ఇప్పుడు కూడా సమస్య ఏమీ లేదు. సినిమాకు మౌత్ టాక్ బజ్ పెరుగుతోంది. అల్లరి నరేష్ కు ప్రశంసలు దొరకుతున్నాయి.