2020 టాప్ ట్రెండింగ్ లో సూర్య సినిమా

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా టాప్ ట్రెండింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది గూగుల్. ఈ ఏడాది భారీ స్థాయిలో ట్రెండ్ అయిన సినిమాల టాప్-5 జాబితాలో సూర్య సినిమా చోటు దక్కించుకోవడం విశేషం. అతడు…

ఎప్పట్లానే ఈ ఏడాది కూడా టాప్ ట్రెండింగ్స్ జాబితాను రిలీజ్ చేసింది గూగుల్. ఈ ఏడాది భారీ స్థాయిలో ట్రెండ్ అయిన సినిమాల టాప్-5 జాబితాలో సూర్య సినిమా చోటు దక్కించుకోవడం విశేషం. అతడు నటించిన సురారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) రెండో స్థానంలో నిలిచింది. ఈ  ఏడాది లేటుగా వచ్చినప్పటికీ ట్రెండింగ్ లో మాత్రం టాప్ లోకి దూసుకెళ్లింది ఈ సినిమా.

ఇక టాప్-10 ట్రెండింగ్ మూవీస్ లో మొదటి స్థానంలో సుశాంత్ నటించిన దిల్ బేచారా సినిమా నిలిచింది. భారత్ లో భారీ ఎత్తున ట్రెండ్ అయిన సినిమా ఇదే. సుశాంత్ మరణించిన తర్వాత రిలీజైన సినిమా కావడంతో దీనిపై నెటిజన్లంతా ప్రత్యేక ఆసక్తి/శ్రద్ధ చూపించారు.

ఇక లిస్ట్ లో మూడో స్థానంలో తన్హాజీ, నాలుగో స్థానంలో శకుంతలదేవి, ఐదో స్థానంలో గుంజన్ సక్సేనా సినిమాలు నిలిచాయి. లక్ష్మి సినిమాకు ఆరో స్థానం, సడక్-2కు ఏడో స్థానం దక్కాయి.

ఇక ట్రెండింగ్ పర్సనాలిటీస్ లో ఎప్పట్లానే ఈ ఏడాది కూడా అమితాబ్ బచ్చన్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. ఇండియాలో ఈ ఏడాది అత్యథికంగా ట్రెండ్ అయిన వ్యక్తుల జాబితాలో బిగ్-బి ఐదోస్థానంలో నిలిచారు. 

మొదటి స్థానంలో జో బైడెన్, రెండో స్థానంలో అర్నాబ్ గోస్వామి నిలిచారు. డ్రగ్స్ కేసులో అరెస్టయి, బెయిల్ పై రిలీజైన రియా చక్రబొర్తి ఏడో స్థానంలో.. వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన కంగనా రనౌత్ పదో స్థానంలో నిలిచారు.

ఇక ఇండియాలో ఓవరాల్ ట్రెండింగ్స్ లో టాప్ లో నిలిచిన అంశం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఓవరాల్ టాప్ ట్రెండింగ్ లో కరోనా వైరస్ ప్రథమ స్థానంలో నిలవగా.. కరోనా వైరస్ కారక రోగాలు అనే అంశం రెండో స్థానంలో నిలిచింది.

మ‌హేష్ తో ఒక్క‌డు కంటే గొప్ప సినిమా తీయాలి