విశాఖ చుట్టూ పాతిక కోట్ల మొక్కలు

విశాఖ ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడినదే. పల్లెదనంతో పదహారేళ్ల పడుచుపిల్లలా పరవశించినదే. అయితే మెగా సిటీగా ఎదుగుతున్న నేపధ్యంలో చుట్టూ రసాయనిక  పరిశ్రమలు వచ్చి పడ్డాయి. వాటి నుంచి వచ్చే కాలుష్యంతో గాలీ, నీరు కూడా…

విశాఖ ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడినదే. పల్లెదనంతో పదహారేళ్ల పడుచుపిల్లలా పరవశించినదే. అయితే మెగా సిటీగా ఎదుగుతున్న నేపధ్యంలో చుట్టూ రసాయనిక  పరిశ్రమలు వచ్చి పడ్డాయి. వాటి నుంచి వచ్చే కాలుష్యంతో గాలీ, నీరు కూడా పొల్యూట్ అవుతున్నాయి.

మరో వైపు చూస్తే పచ్చని విశాఖ కాస్తా తగ్గిపోతోంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక విశాఖను రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో మరింతగా జనాభా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

విశాఖలో ఇప్పటికే పాతిక లక్షల జనాభా ఉంది. 2050 నాటికి అరకటి పై మాటగా ఉంటుందని అంటున్నారు. దాంతో విశాఖ పచ్చదనం మీద వైసీపీ సర్కార్ దృషిటి పెడుతోంది. దీనిని ఒక ఉద్యమంగా చేపడుతున్నారు.

విశాఖ చుట్టూ పాతిక కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించడం నిజంగా మంచి పరిణామమే. గత కొంతకాలంగా ఈ మొక్కలు పెంచే కార్యక్రమం ఒక యాగంలా సాగుతోంది. దీనిని ఎంపీ విజయసాయిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన గ్రీన్ విశాఖే తమ లక్ష్యమని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేశల మేరకు విశాఖలో  దశలవారీగా మొక్కలు నాటుతున్నామని పాతిక కోట్ల మొక్కలతో నగరం ఉద్యానవనంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అంటున్నారు. మొత్తానికి విశాఖకు అభివృద్ధి కావాలి. దానికి మించి ఆరోగ్యం కూడా కావాలి. ఆ దిశగా వైసీపీ సర్కార్ యాక్షన్ ప్లాన్ రూపొందించడం  ఆనందకరం అని చెప్పాలి.

పవర్ స్టార్ పేరెత్తగానే