తమ్మినేని స్పీకర్ గా…బాబుకు టార్చరేనా?

అందుకే ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు అంటారు. తమ్మినేని రాజకీయాలలోకి రాకముందు వెయిట్ లిఫ్టర్. ఆయన దూకుడు రాజకీయం చేస్తారని పేరు.  Advertisement నాడు సీనియర్ నేత కాంగ్రెస్ వృద్ధ నేత బొడ్డేపల్లి రాజగోపలారావునాయుడుని…

అందుకే ఎవరినీ తక్కువ చేసి చూడవద్దు అంటారు. తమ్మినేని రాజకీయాలలోకి రాకముందు వెయిట్ లిఫ్టర్. ఆయన దూకుడు రాజకీయం చేస్తారని పేరు. 

నాడు సీనియర్ నేత కాంగ్రెస్ వృద్ధ నేత బొడ్డేపల్లి రాజగోపలారావునాయుడుని యువకుడిగా ఉన్నపుడే ఓడించి మరీ 1983లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు తమ్మినేని సీతారాం.

శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన తమ్మినేని ఎన్టీయార్ కి ఇష్టుడైన నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రబాబు జమానాలో మొదట్లో బాగానే ఉన్నా తరువాత కింజారాపు ఫ్యామిలీ మీద అవ్యాజమైన ప్రేమతో తమ్మినేనిని  బాబు రాజకీయంగా తొక్కడం ప్రారంభించారని అంటారు. 

మొత్తానికి అది తమ్మినేని పార్టీ నుంచి బయటకు పోయేలా చేసింది.ఎటూ కాకుండా పోతారనుకున్న తమ్మినేని ఇలా గెలిచి స్పీకర్ గా రావడం, అధ్యక్షా అంటూ చంద్రబాబు ఆయన ముందే నిలబడాల్సిరావడం రాజకీయ విచిత్రంగా చూడాలి. 

ఇక తమ్మినేని మీద బాబుకు అక్కసు ఎంతో ఉందో ఏమో కానీ పేపర్స్ స్పీకర్ మీద విసిరేశారు. ఆయన మీద తర్జనిని చూపిస్తూ బెదిరించారు.

మొత్తానికి తమ్మినేని తనకు మైక్ ఇవ్వడంలేదని అందరి చేత తిట్టిస్తున్నారని బాబు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇవ్వడాలే కాదు, పుచ్చుకోవడాలూ ఉంటాయనడానికి తమ్మినేని బాబు ఎపిసోడ్ ఉదాహరణేమో.