టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోసం ఓ అభిమని గుడి కడుతున్నారు. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి తన ఇంట్లో సమంత కోసం గుడిని నిర్మిస్తున్నారు. సమంత బర్త్ డే నాటికి గుడిని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అభిమానుల చేత ఎంతో ఆప్యాయంగా గుడి కట్టించుకున్న ఏకైక హీరోయిన్ గా ఖుష్బూ గుర్తింపు పొందింది. ఖుష్బూ తరువాత హన్సిక, నమిత, నిధి అగర్వాల్ లకు తమ అభిమానులు గుళ్ళు కట్టించారు. తాజాగా సమంత వీరి జాబితాలో చేరబోతోంది. కాగా 1991వ సంవత్సరంలో చిన తంబి సినిమా షూటింగ్లో ఉండగా, కుష్బూ కోసం ఆమె అభిమానులు గుడి కట్టారు. ఎంతో అభిమానంతో ఖుష్బూకి గుడి కట్టిన వారే కొన్ని కారణాల వల్ల ఆమె గుడిని కూల్చివేశారు.
తన మొదటి సినిమా ఏమాయచేశావె సినిమాతో కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది సమంత. అందం, అభినయం, తన నటనతో టాలీవుడ్లో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.