సినిమాల్లోకి తెలుగమ్మాయిలు ఇంకా రావాలి

హీరోయిన్ల విషయంలో నిత్యం బాలీవుడ్ వెంట పడుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ముద్దుగుమ్మ దొరక్కపోతే, నార్త్ అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తుంది. అంతేతప్ప, తెలుగమ్మాయిల్ని తీసుకోవడానికి ఇక్కడి మేకర్స్ పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ పరిస్థితిలో…

హీరోయిన్ల విషయంలో నిత్యం బాలీవుడ్ వెంట పడుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ ముద్దుగుమ్మ దొరక్కపోతే, నార్త్ అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తుంది. అంతేతప్ప, తెలుగమ్మాయిల్ని తీసుకోవడానికి ఇక్కడి మేకర్స్ పెద్దగా ఇష్టపడరు. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని అంటోంది హీరోయిన్ డింపుల్ హయతి.

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల తెలుగమ్మాయే అంటోంది డింపుల్. శ్రీలల తరహాలో తనకు కూడా వరుసగా అవకాశాలు వస్తాయని చెబుతోంది. త్వరలోనే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది డింపుల్.

డింపుల్ తండ్రిది తమిళనాడు. తల్లిది బెజవాడ. వ్యాపారరీత్యా హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. డింపుల్ హైదరాబాద్ లోనే పెరిగింది. అలా తెలుగమ్మాయి అనే ట్యాగ్ లైన్ వచ్చేసింది. అయితే తన కెరీర్ కు అదిప్పుడు మైనస్ కాదంటోంది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తనకు తెలుగు, తమిళ, హిందీ భాషల నుంచి అవకాశాలొస్తున్నాయని, మరింతమంది తెలుగమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మార్పు గమనించవచ్చని అంటోంది.