సమ్మర్ వచ్చిందా.. అయితే మన దగ్గర బేరాల్లేవమ్మా!

వేసవి వచ్చిందంటే హీరోలంతా విదేశాలకు క్యూ కడతారు. చల్లగా సేదతీరేందుకు మొగ్గుచూపుతారు. మరి షూటింగ్స్ ఉంటే ఏం చేస్తారు? తమ షెడ్యూల్స్ ను విదేశాల్లో పెట్టుకుంటారు. అయితే తప్పనిసరి పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోనే…

వేసవి వచ్చిందంటే హీరోలంతా విదేశాలకు క్యూ కడతారు. చల్లగా సేదతీరేందుకు మొగ్గుచూపుతారు. మరి షూటింగ్స్ ఉంటే ఏం చేస్తారు? తమ షెడ్యూల్స్ ను విదేశాల్లో పెట్టుకుంటారు. అయితే తప్పనిసరి పరిస్థితుల మధ్య హైదరాబాద్ లోనే షూట్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? మహేష్ లాంటి హీరోలైతే గ్యాప్ తీసుకుంటారు.

అవును.. మహేష్ తన కొత్త సినిమా షెడ్యూల్ కు గ్యాప్ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. 21 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవ్వాలి. కానీ అదింకా స్టార్ట్ కాలేదు.

నిజానికి ఈ షెడ్యూల్ కంటే ముందు విదేశాలకు వెళ్లాడు మహేష్. అలా సమ్మర్ లో ఓ టూర్ కంప్లీట్ చేశాడు. ఫారిన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత కొత్త షెడ్యూల్ మొదలవుతుందని అంతా అనుకున్నారు. యూనిట్ కూడా ఏర్పాట్లు చేసింది. కానీ మహేష్ మాత్రం సెట్స్ పైకి రాలేదు.

హైదరాబాద్ లో ఉండి కూడా మహేష్ ఎందుకు సెట్స్ పైకి రాలేదనే విషయం బయటకురాలేదు. తాజా సమాచారం ప్రకారం, మండే ఎండల్లో షూటింగ్ చేయలేక, మహేష్ గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇలా షెడ్యూల్స్ ఆలస్యమవ్వడం ఈ ప్రాజెక్టుకు కొత్తేంకాదు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. దాంతో పోలిస్తే ఈ 2-3 రోజుల ఆలస్యం పెద్ద సమస్య కాదు. పైగా ఈ సినిమా విడుదల తేదీని కూడా పోస్ట్ పోన్ చేశారు.

సమ్మర్ అంటే మహేష్ కు పడదు. వేసవి వేడి నుంచి తప్పించుకునేందుకు మ్యాగ్జిమమ్ తన సినిమా షూటింగ్స్ ను వేసవిలో లేకుండా ప్లాన్ చేసుకుంటాడు. ఈసారి మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ ఎండ వేడి భరించక తప్పదేమో.