విశాఖ టూర్ కి జగన్ రెడీ…?

చాన్నాళ్ళ తరువాత ముఖ్యమంత్రి జగన్ విశాఖ వస్తున్నారు. కొత్త ఏడాదిలో జగన్ విశాఖ రావడం ఇదే ఫస్ట్ టైమ్. మరి జగన్ విశాఖ టూరులో స్పెషల్స్ ఏంటి అంటే ఇప్పటివరకూ ఖరారు అయిన ప్రోగ్రాం…

చాన్నాళ్ళ తరువాత ముఖ్యమంత్రి జగన్ విశాఖ వస్తున్నారు. కొత్త ఏడాదిలో జగన్ విశాఖ రావడం ఇదే ఫస్ట్ టైమ్. మరి జగన్ విశాఖ టూరులో స్పెషల్స్ ఏంటి అంటే ఇప్పటివరకూ ఖరారు అయిన ప్రోగ్రాం అయితే స్వామి కార్యం మీదనే జగన్ విశాఖ వస్తున్నారు. విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలలో జగన్ పాల్గొనడానికి విశాఖ వస్తున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక క్రమం తప్పకుండా శారదాపీఠం వార్షికోత్సవాలకు రావడం ఆనవాయితీగా మారింది. పీఠాధిపతి శ్రీ  స్వరూపానందేంద్ర మహస్వామి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు విశాఖ పాలనా రాజధాని విషయం ఏమైనా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ముహూర్తం విషయంలో కూడా స్వామితో చర్చిస్తారు అన్న ప్రచారం కూడా సాగుతోంది.

మొత్తానికి ఈ నెల 9న పీఠానికి వస్తున్న జగన్ పనిలో పనిగా విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయా అన్నది చూడాలి. కేవలం పీఠం సందర్శనకు మాత్రమే ముఖ్యమంత్రి పరిమితం అవుతారా లేక విశాఖలో అధికారులతో సమీక్ష అవుతుందా అన్నది కూడా చూడాలి. 

మొత్తానికి ఒక వైపు కొత్త జిల్లాలు ప్రకటించిన జగన్ విశాఖ టూర్ సుమారు మూడు నెలల తరువాత చేపట్టనుండడంతో అధికార రాజకీయ వర్గాలలో ముఖ్యమంత్రి జగన్ టూర్ మీద సర్వత్రా ఆసక్తి అయితే  నెలకొంది