మిస్టరీ.. బయట నుంచి తాళం.. లోపల ఉరి

హైదరాబాద్ లో మరో అనుమానాస్పద మరణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి, తన స్నేహితుడి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గదికి తాళం పెట్టి…

హైదరాబాద్ లో మరో అనుమానాస్పద మరణం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి, తన స్నేహితుడి గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గదికి తాళం పెట్టి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును ఛేదించే పనిలో పడ్డారు.

హైదరాబాద్ మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది యువతి. ఆమె జాతీయస్థాయిలో ఖోఖో ప్లేయర్ కూడా. కోచ్ ఫ్రెండ్ శ్రీకాంత్ తో యువతికి పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు శ్రీకాంత్ గదికి వెళ్లి వస్తుంటుంది.

ఈ క్రమంలో నిన్న కూడా శ్రీకాంత్ ఇంటికి వెళ్లింది యువతి. అయితే గదిలో శ్రీకాంత్ లేడు. అతడు తన స్వగ్రామం తాండూరు వెళ్లాడు. అదే విషయాన్ని ఇద్దరూ ఫోన్ లో కూడా మాట్లాడుకున్నారు. రాత్రి తన గదికి వచ్చిన శ్రీకాంత్, తలుపులు తెరిచి చూసేసరికి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని కనిపించింది యువతి.

మిస్టరీ డెత్ పై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు యువతి తల్లిదండ్రులు మాత్రం ఏదో నిశ్చితార్థం ఉందని చెప్పి తమ కూతురు బయటకెళ్లిందని చెబుతున్నారు. 

బాబుని వేటాడుతున్న భయం