బాబు, పవన్.. అసలు రంగులు ఈరోజు బయటపడతాయి

ప్రభుత్వానికీ, ఉద్యోగులకు మధ్య గొడవ జరుగుతోంది. పంతాలు, పట్టింపులకు పోయి రెండు విభాగాలు తెగేదాకా లాగుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఉద్యోగుల వైపే తప్పు కనిపిస్తున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా తన పెద్దరికాన్ని…

ప్రభుత్వానికీ, ఉద్యోగులకు మధ్య గొడవ జరుగుతోంది. పంతాలు, పట్టింపులకు పోయి రెండు విభాగాలు తెగేదాకా లాగుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఉద్యోగుల వైపే తప్పు కనిపిస్తున్నా.. ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోకుండా తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటోంది. ఏకంగా ముఖ్యంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా, సెటైరిక్ పాటలు పాడుతున్నా చూసీ చూడనట్టు వదిలేశారు. ఇంత జరుగుతున్నా ఈ విషయంలో ప్రతిపక్షాలు మాత్రం ఇప్పటి వరకు సంయమనం పాటించడం విశేషం.

మా ఉద్యమంలో రాజకీయాలకు తావులేదంటూ ఉద్యోగ సంఘాల్లోని కొందరు నేతలు గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో గోతికాడ నక్కలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో తాము యుద్ధం చేయడంలేదని, కేవలం తమ ఆవేదన మాత్రమే చెబుతున్నామని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. 

ఇందులో రాజకీయ ప్రయోజనాలు వెదుక్కోడానికి ప్రతిపక్షాలకు ఛాన్స్ లేకుండా చేశారు. కానీ ప్రతిపక్షాలు అటు నుంచి నరుక్కు వస్తున్నాయి. ఉద్యమంలోకి నేరుగా రాకుండా తమ అనుకూల మీడియాతో చిచ్చు పెట్టారు. అది కాస్తా ఇప్పుడు చలో విజయవాడ రణరంగంలా మారేందుకు అవకాశమిచ్చింది.

ప్రభుత్వం వద్దంటోంది, ఉద్యోగులు సై అంటున్నారు. ఈ దశలో చలో విజయవాడ గరంగరంగా సాగే అవకాశముంది. ప్రతిపక్షాలకు కూడా కావాల్సింది ఇదే. ఉద్యోగులపై లాఠీలు విరగాలి, వారిని అరెస్ట్ చేయాలి, వారిపై సింపతీ ప్రకటిస్తూ ఆ ఉద్యమాన్ని, వారిలో ఉన్న అసంతృప్తిని తాము క్యాష్ చేసుకోవాలి. చంద్రబాబు అయినా, పవన్ అయినా.. దీని కోసమే వేచి చూస్తున్నారు. వారి అసలు రంగులు బయటపడే రోజు రానే వచ్చింది.

గొడవ జరిగితే వెంటనే ముసుగు తీసేందుకు బాబు, పవన్ రెడీగా ఉన్నారు. ప్రెస్ మీట్ మ్యాటర్లు, ప్రెస్ నోట్ మ్యాటర్లు అంతా రెడీగా ఉన్నాయట. టీడీపీ హయాంలో ఉద్యోగులకు ఏం చేశారనేది, ఇప్పుడు ఏం జరుగుతుందనేదానిపై లెక్చర్లు దంచేందుకు బాబు రెడీగా ఉన్నారట. 

వారికి కావాల్సిందల్లా ఒక్కటే, ఎక్కడో ఓ చోట ఉద్యోగిపై లాఠీ దెబ్బ పడాలి, ఆ తర్వాత తాము సీన్లోకి రావాలి. దీని కోసమే పవన్ కూడా ఈరోజు మిగతా కార్యక్రమాలేవీ పెట్టుకోకుండా రెడీగా ఉన్నారట. ముగుసు తీసేసి, ఉద్యోగులపై సింపతీ కురిపించేసి, తాము హీరోల్లాగా బిల్డప్ ఇవ్వాలనుకుంటున్నారు వీరిద్దరూ. ఉద్యోగుల దృష్టిలో జగన్ ని విలన్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.