మరో రెండు వారాలు ఇలాగే

ఆంధ్రలో కోవిడ్ నిబంధనలను మరో రెండు వారాల పాటు పొడిగించారు. ఇది కచ్చితంగా టాలీవుడ్ కు ఇబ్బందికరమైన పరిస్థితే. యాభైశాతం ఆక్యుపెన్సీ అన్నది పెద్ద సమస్య కాదు కానీ సెకెండ్ షో లేకపోవడం అన్నది…

ఆంధ్రలో కోవిడ్ నిబంధనలను మరో రెండు వారాల పాటు పొడిగించారు. ఇది కచ్చితంగా టాలీవుడ్ కు ఇబ్బందికరమైన పరిస్థితే. యాభైశాతం ఆక్యుపెన్సీ అన్నది పెద్ద సమస్య కాదు కానీ సెకెండ్ షో లేకపోవడం అన్నది సమస్యే. ఈ నెల 11న ఖిలాడీ లాంటి పెద్ద సినిమా విడుదలవుతోంది. 

ఇప్పటి వరకు ఆంధ్రలో సెకెండ్ షో లు వేయడం లేదు. పెద్దగా కలెక్షన్లు లేవు కనుక టైమ్ లు అడ్జ‌స్ట్ చేసి సెకెండ్ షో వేసే ఆలోచన ఎవ్వరూ చేయలేదు. కానీ ఇప్పుడు ఖిలాడీ సినిమా వస్తోంది కనుక ఏమైనా అడ్జ‌స్ట్ చేస్తారేమో చూడాలి.

ఆంధ్రలో 11.30 కి మార్నింగ్ షో అన్నది అలవాటు. ఇప్పుడు అది 10 గంటలకు లేదా 10.30 కి మార్చుకోవాల్సి వుంటుంది. అప్పుడే సెకెండ్ షో కి వీలు అవుతుంది. 11న విడుదల అవుతున్న డిజె టిల్లు సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే. అందువల్ల మార్నింగ్ షో టైమ్ కొద్దిగా మార్చుకుంటే సెకెండ్ షో వేసుకోవచ్చు.

ఖిలాడీ విషయం ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే 50శాతం ఆక్యుపెన్సీ, సెకెండ్ షో లేదు అనగానే బయ్యర్లు బేరాలు మొదలుపెడతారు. ఆంధ్ర ఏరియా 10 కోట్ల రేషియోలో విక్రయించారు. ఇప్పుడు అఖండ‌, పుష్పల మాదిరిగా తగ్గించాలంటే రెండు కోట్లు ఎగిరిపోతాయి. అందువల్ల 11న వేస్తారా? 18 కి వాయిదా వేస్తారా అన్నది చూడాలి.