భీమ్లానాయక్ చూసిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదలకు సరైన డేట్ దొరకడం లేదు.  Advertisement ఫిబ్రవరి 25న విడుదల చేయాలని, కుదరకపోతే ఏప్రిల్ 1న…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా విడుదలకు సరైన డేట్ దొరకడం లేదు. 

ఫిబ్రవరి 25న విడుదల చేయాలని, కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదలకు నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెడీ అయిన ఫస్ట్ కాపీని హీరో పవన్ కళ్యాణ్ చూసారు.

ప్రసాద్ లాబ్ లో ఈ రోజు ఆయన డిటిఎస్ థియేటర్ లో భీమ్లా నాయక్ ఫైనల్ అవుట్ పుట్ ను పవన్ చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మిక్సింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సిజి వర్క్ లు కూడా పూర్తయ్యాయి.

సినిమాను అన్ని విధాలా రెడీ చేసి వుంచుతారు. పరిస్థితులు అన్నీ సెట్ రైట్ అయితే ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తారు. లేదూ అంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్, మాటలు అందించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు ఇప్పటికే భీమ్లా పాటలు బాగా వైరల్ అయ్యాయి.