దేవీ ఉప్పెన సిగ్నేచర్ మ్యూజిక్

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. కాకినాడ తీరం నేపథ్యంలో అల్లుకున్న ఓ ప్రేమకథ. సుకుమార్ కు అనుబంధం పెనవేసుకున్న దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఉప్పెన సినిమా…

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. కాకినాడ తీరం నేపథ్యంలో అల్లుకున్న ఓ ప్రేమకథ. సుకుమార్ కు అనుబంధం పెనవేసుకున్న దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఉప్పెన సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ ఓ సిగ్నేచర్ మ్యూజిక్ బిట్ ను తయారుచేసి విడుదల చేసారు.

ఈ ట్యూన్ ఎలా వుందీ అనే కన్నా ముందు దీనికి వాడిన వాయిద్య పరికరాలు ఓ విశేషంగా కనిపిస్తున్నాయి. దేశీయ వ్యాయిద్యాలయిన, మాండోలిన్ వగైరా వాడి ఈ ఇనుస్ట్రుమెంటేషన్ బిట్ చేసారు. దీనికి యాడ్ చేసిన విజువల్స్ బాగున్నాయి. మాండోలిన్ వాడడంతో, గతంలో దేవీ రంగస్థలంలో చేసిన 'ఎంత చక్కంగున్నావే' అన్న బిట్ చటుక్కున మైండ్ లోకి వస్తుంది. పాట బయటకు వస్తే, దేవీ ఏం చేసారు, ఎలా చేసారు అన్నది క్లారిటీ వస్తుంది.

వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా చేస్తున్నఈ సినిమా ప్రీ సమ్మర్ టైమ్ లో విడుదల అవుతుంది. మైత్రీ మూవీస్ ఈ సినిమా మీద నమ్మకంతో బాగా ఖర్చు చేసింది. సుకుమార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా వున్నారు.