అల్లరి నరేష్ కొత్త చిత్రం

కేవలం కామెడీ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు ఆచి తూచి చేస్తున్నాడు అల్లరి నరేష్. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తాను మారుతూ వస్తున్నాడు.  Advertisement లేటెస్ట్ గా మరో…

కేవలం కామెడీ సినిమాలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు ఆచి తూచి చేస్తున్నాడు అల్లరి నరేష్. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తాను మారుతూ వస్తున్నాడు. 

లేటెస్ట్ గా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అల్లరి న‌రేష్‌, ఆనంది హీరో హీరోయిన్లుగా హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా ఈ సినిమాను చేస్తున్నారు. దీనికి ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ కొత్త చిత్రం సోమ‌వారం నాడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. 

బాలాజీ గుత్తా స‌హ నిర్మాత‌. ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్‌ను బాలు మున్నంగి కొట్ట‌గా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వెన్నెల కిషోర్‌, చ‌మ్మ‌క్ చంద్ర ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా వెంక‌ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.