పవన్ బీఆర్ఎస్ బంధం …అవునా నిజమేనా…?

తెలంగాణ సమాజానికి ప్రజలకు వైసీపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ రాజకీయ మంటనే పుట్టిస్తోంది. వరుసగా వైసీపీ మంత్రులు పవన్ని టార్గెట్ గా చేసుకుని ఎదురు దాడి చేస్తున్నారు.…

తెలంగాణ సమాజానికి ప్రజలకు వైసీపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ రాజకీయ మంటనే పుట్టిస్తోంది. వరుసగా వైసీపీ మంత్రులు పవన్ని టార్గెట్ గా చేసుకుని ఎదురు దాడి చేస్తున్నారు. ఏపీ ప్రజలను ఇప్పటికి కొన్ని వందల సార్లు తెలంగాణా మంత్రులు నాయకులు అవమానిస్తే నోరు విప్పావా పవన్ అంటూ మంత్రి సీదరి అప్పలరాజు ప్రశ్నిస్తున్నారు

ఏపీని అవమానించినా ఫరవాలేదా, పవన్ అసలు ఎలా ఆలోచిస్తున్నారు అని ఆయన నిగ్గదీస్తున్నారు. పవన్ తెలంగాణాలో బీఆర్ఎస్ తో ఏపీలో టీడీపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతున్నారా అని అప్పలరాజు డైరెక్ట్ గా అడిగేశారు.

అలా కాకపోతే హరీష్ రావుని సడెన్ గా వెనకేసుకుని రావాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే వరంగల్ లో అమ్మాయి ఆత్మ హత్య మీద కానీ తెలంగాణా ఆసుపత్రిలో వీల్ చైర్ లో రోగిని తీసుకెళ్ళినపుడు కానీ పవన్ నోరు విప్పారా అని సీదరి పాయింట్ రైజ్ చేశారు.

ఏపీకి తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తూంటే ఏనాడైనా మాట్లాడారా పవన్ అని కూడా అడిగారు. గోదావరి జలాల విషయం గురించి ఎపుడైనా ప్రస్తావించారా అని నిలదీశారు. ఇంతకీ బీఆర్ఎస్ తో మీ రహస్య ఒప్పందమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ తో పవన్ కళ్యాణ్ కి వేల కోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో తాను ఈ మధ్య చూశానని పవన్ మాటలు చూస్తూంటే బహుశా అది నిజమేనేమో అనిపిస్తోందని మంత్రి అంటున్నారు. సీదరి అప్పలరాజు పవన్ బీఆర్ఎస్ బంధం మీద డౌట్లు వ్యక్తం  చేస్తూ మంత్రి అడిగిన ప్రశ్నలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సమాధానం ఏమి చెబుతారో.