గతంలో పలుమార్లు హిట్ సినిమాలు వచ్చినా కానీ తొందరపడి ఎంచుకున్న సినిమాలు రామ్ రేంజ్ పెరగనివ్వలేదు. అందుకే ఇప్పుడు రామ్ చాలా జాగ్రత్త పడుతున్నాడు.
ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన అడ్వాంటేజ్‌ని వాడుకుని స్టార్‌గా ఎదగాలని చూస్తున్నాడు. అందుకే గత ఎనిమిది నెలలలో ఎన్ని కథలు విన్నా కానీ ఏదీ ఓకే చేయలేదు.
రెడ్ సినిమా రిలీజ్‌కి రెడీ అయినా కానీ ఓటిటికి ఇవ్వలేదు. థియేటర్లలోనే విడుదల చేస్తానంటూ ఆ సినిమాను అలాగే వుంచేసాడు.
రెడ్ రిలీజ్‌కి సిద్ధంగా వుంది కనుక తదుపరి చిత్రానికి గ్యాప్ వచ్చినా ఫర్వాలేదని టాప్ డైరెక్టర్ కోసం రామ్ ఎదురు చూస్తున్నాడు. కానీ అగ్ర దర్శకులెవరూ ఇప్పుడు ఖాళీగా లేరు.
త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్, బోయపాటి, సురేందర్, హరీష్ శంకర్… తదితర దర్శకులంతా ఆల్రెడీ వేరే చిత్రాలకు కమిట్ అయి వున్నారు.
మిడిల్ రేంజ్ దర్శకులైన మారుతిలాంటి వాళ్ల పట్ల రామ్ ఆసక్తి చూపించడం లేదు. యువ దర్శకులతో చేస్తే హిట్టిచ్చినా రేంజ్ రాదనుకుంటున్నాడు. మరిప్పుడు రామ్ ఎదురు చూపులు ఫలించి వెంటనే సినిమా మొదలు పెట్టే దర్శకుడెలా దొరుకుతాడు?