పవన్ కళ్యాణ్ ఇక మళ్లీ నటించేది లేదంటూ ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాడు. కోట్ల ఆదాయం వదిలేసుకుని ప్రజాసేవకు వచ్చేసానంటూ తన ప్రసంగాల్లో నొక్కి మరీ చెప్పాడు. ఎలక్షన్స్ అయిపోయాక పవన్ తిరుగుటపాలో ఫిలిం నగర్‌లో వాలిపోతాడంటూ విమర్శలు రాగా… పవన్ చివరకు అదే చేసాడు. ఇందులో తప్పేమీ లేదు కానీ ఇండస్ట్రీకి తిరిగి వచ్చి ఇక్కడైనా మాట మీద నిలబడుతున్నాడా అంటే లేదు.
పవన్ మళ్లీ నటించాలి అని డిసైడ్ అయితే ముందుగా అడ్వాన్స్ ఏనాడో ఇచ్చిన నిర్మాతలకు డేట్స్ ఇవ్వాలి. కానీ తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయం అని ఆశ చూపించిన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చాడు. కనీసం వకీల్ సాబ్ తర్వాత అయినా రత్నం, మైత్రి మూవీస్ సినిమాలు చేస్తున్నాడా అంటే అదీ లేదు.
మరోసారి తక్కువ రోజుల్లో ఎక్కువ రాబడి వచ్చే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం రీమేక్ ఎంచుకున్నాడు. పవన్ చేస్తున్నది అటు నిర్మాతలకు, ఇటు తన కోసం ఎదురు చూస్తోన్న దర్శకులకు నచ్చట్లేదు కానీ అతడిని నిలదీసే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. కాల్షీట్‌కు కోటి రూపాయలు ఛార్జ్ చేస్తోన్న పవన్ కళ్యాణ్ మరి అందుకు తగ్గట్టుగానే నిర్మాతలకు ఫేవర్‌గా వుండాలి కదా? రాజకీయాల్లో వుండాలంటోన్న క్రమశిక్షణ తనకు ఆదాయాన్నిస్తోన్న పరిశ్రమలో లేకపోతే ఎలా?