యాంక‌ర్ ప్ర‌దీప్‌ను వెంటాడుతున్న‌ ‘అమ్మాయి’ కేసు

ప్ర‌దీప్ మాచిరాజు మేల్ యాంక‌ర్స్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే అత‌నికి పాపులారిటీతో వివాదాలు కూడా ప‌లు సంద‌ర్భాల్లో చుట్టుముట్టాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల‌కు ప‌ట్టుబడి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం…

ప్ర‌దీప్ మాచిరాజు మేల్ యాంక‌ర్స్‌లో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే అత‌నికి పాపులారిటీతో వివాదాలు కూడా ప‌లు సంద‌ర్భాల్లో చుట్టుముట్టాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల‌కు ప‌ట్టుబడి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌స్తుతం అమ్మాయిని వేధించిన కేసు అత‌న్ని నీడ‌లా వెంటాడుతోంది.  అత‌ను ఓ అమ్మాయిని కూడా వేధించాడ‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అంతేకాదు అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు జైలుకు కూడా వెళ్లాడ‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌రామోజు సునిశిత్ తెలిపాడు.

ప్ర‌దీప్‌పై అత‌ను బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఇది అమ్మాయి విష‌య‌మైతే కాదు. కానీ అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు శిక్ష అనుభ‌వించిన ప్ర‌దీప్ సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం స‌ర్టిఫికేష‌న్ నిబంధ‌న‌లకు విరుద్ధంగా ఓ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడ‌ని మేడ్చ‌ల్ జిల్లా కీస‌ర స‌మీపంలోని రాంప‌ల్లికి చెందిన శ్రీ‌రామోజు సునిశిత్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.
 
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో ప్రదీప్‌ మాచిరాజు ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు ఆయ‌న తెలిపాడు. అయితే నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఈ సినిమాలో ప్ర‌దీప్ న‌టిస్తున్న‌ట్టు  ద‌ర్శ‌కుడు ఆరోపించాడు. యాంక‌ర్ ప్ర‌దీప్‌తో పాటు ఆ సినిమా ద‌ర్శ‌కుడు కూడా నిబంధ‌న‌లు అతిక్ర‌మించాడ‌ని, స‌ద‌రు సినిమా షూటింగ్ నిలిపేయాల‌ని ఫిర్యాదులో అత‌ను కోరాడు. చివ‌రికి ఏమ‌వుతుందోన‌ని ఉత్కంఠ ప్ర‌దీప్ అభిమానుల్లో నెల‌కొంది.