సమంతను చాలా డేంజరస్ గర్ల్ అంటున్నాడు శర్వానంద్. ఎందుకంటే, ఆమె యాక్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే డామినేట్ చేస్తుందని చెబుతున్నాడు. జాను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడిన శర్వా.. సమంత లేకపోతే ఈ సినిమా లేదంటున్నాడు.
“సమంత చాలా డేంజరస్. నిత్యామీనన్, సమంత, సాయిపల్లవి లాంటి హీరోయిన్లతో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సీన్ అంతా వాళ్లే తినేస్తారు. అందుకే కొంచెం మేనేజ్ చేసి సమంతతో సమానంగా రావడానికి ట్రై చేశాను. జాను సినిమాలో నేను బాగా పెర్ఫార్మ్ చేశానంటే ఆ క్రెడిట్ మొత్తం సమంతాకే ఇవ్వాలి.”
ఇలా డేంజరస్ అంటూనే సమంతను పొగిడేశాడు శర్వానంద్. జాను సినిమాలో రామచంద్ర పాత్రలానే, రియల్ లైఫ్ లో తనది కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటున్నాడు శర్వానంద్. అందుకే ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోలేదన్నాడు. అంతకుమించి తన లవ్ గురించి ఎక్కువగా అడగొద్దంటున్నాడు.
ఈ ఫంక్షన్ కు నాని చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. తన బెస్ట్ ఫ్రెండ్ నాని, తన సినిమాకు చీఫ్ గెస్ట్ గా రావడంతో శర్వానంద్ చాలా హ్యాపీ ఫీలయ్యాడు. ఫస్ట్ టైమ్ ఇద్దరూ కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకోవడంతో పాటు తామిద్దరం కలిసి ఎన్నో ట్రిప్పులు వేశామనే విషయాన్ని కూడా బయటపెట్టాడు. నాని తనకు ఫ్రెండ్ కాబట్టి, ఎక్కువగా పొగడలేనన్నాడు శర్వానంద్.