జ‌గ‌న్ స‌ర్కార్ లాస్ట్ వార్నింగ్‌!

కొత్త పీఆర్సీ ప్ర‌కారం ఉద్యోగుల జీతాలు, పింఛ‌న్ల‌ను సిద్ధం చేయాల‌ని, ఒక‌వేళ త‌మ ఆదేశాలు ఉల్లంఘించిన‌ట్టైతే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ప్రభుత్వం సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.  Advertisement కొత్త పీఆర్సీని ఉద్యోగులు…

కొత్త పీఆర్సీ ప్ర‌కారం ఉద్యోగుల జీతాలు, పింఛ‌న్ల‌ను సిద్ధం చేయాల‌ని, ఒక‌వేళ త‌మ ఆదేశాలు ఉల్లంఘించిన‌ట్టైతే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ప్రభుత్వం సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. 

కొత్త పీఆర్సీని ఉద్యోగులు వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల త‌మ‌ వేత‌నాలు పెర‌గ‌వ‌నేది ఉద్యోగుల వాద‌న‌, వేద‌న‌. కానీ ప్ర‌భుత్వం మాత్రం ఓవ‌రాల్‌గా ఉద్యోగుల వేత‌నాలు త‌గ్గ‌వ‌నే ప్ర‌చారాన్ని తెర‌పైకి తేవ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో కొత్త పీఆర్సీ ప్ర‌కారం జ‌న‌వ‌రి నెల జీతాలు, పింఛ‌న్ల మొత్తాన్ని పెంచుతూ బిల్లులు సిద్ధం చేయాల‌ని ఆర్థిక‌శాఖ సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది. అయితే తాము ఆ బిల్లులు చేసేది లేద‌ని, ఉద్య‌మ బాట ప‌డుతున్నామంటూ మ‌రీ ముఖ్యంగా ట్రెజ‌రీ ఉద్యోగులు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇవాళ ప్ర‌భుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వ‌డం ఉత్కంఠ రేపుతోంది.

ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే  బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఆర్థికశాఖ తాజా ఉత్తర్వుల్లో కాస్త క‌ఠిన వ్యాఖ్య‌లే చేసింది.  

నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్‌ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్‌ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఉల్లంఘనలకు పాల్పడకూడదని హెచ్చ‌రించింది.

మ‌రి ప్ర‌భుత్వ ఆదేశాల‌ను మ‌న్నించి ఆ ప్ర‌కారం కొత్త పీఆర్సీకి అనుగుణంగా అన్ని ర‌కాల బిల్లుల‌ను చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఒక‌వేళ త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే చ‌ర్చ లేక‌పోలేదు. ఒక్క‌సారి కొత్త పీఆర్సీ ప్ర‌కారం వేత‌నాలు వేస్తే, తాము న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. 

ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించినా పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు అస‌లు ప‌ట్టించుకోలేదు. ముందుగా కొత్త పీఆర్సీ జీవోల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు పాత జీతాలు వేస్తేనే చ‌ర్చ‌ల‌కు వ‌స్తామ‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు చెబుతున్నారు. వాళ్ల డిమాండ్ల‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ప్ర‌భుత్వం మాత్రం లేద‌నేది సుస్ప‌ష్టం.