దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట ఓ జిల్లాను ఏర్పాటుచేయడంపై ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ ఓ ప్రకటన చేసారు.
ఎన్టీఆర్ తనయ పురంధ్రీశ్వరి తరువాత ఆయన సంతానం నుంచి వచ్చిన ప్రకటన ఇదే. ఇప్పటి వరకు కొడుకు బాలకృష్ణ కానీ, మనవలు ఎన్టీఆర్, లోకేష్ లు కానీ స్పందించలేదు. చంద్రబాబు సరేసరి.
ఇలాంటి నేపథ్యంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ను సదా అభిమానించే దర్శకుడు వైవిఎస్ చౌదరి ఓ ప్రకటన చేసారు. ఎన్టీఆర్ జిల్లాను తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నందమూరి రామకృష్ణ ఇప్పుడు ప్రకటన విడుదల చేసారు.
''…తెలుగు జాతిమనదీ నిండుగ వెలుగు జాతి మనది…ప్రాంతాలు వేరైనా మనమందరం తెలుగు బిడ్డలు ఒక్కటేనని చాటిచేప్పి… తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జీవింప చేసి ఎర్రకోటపై మన తెలుగు జాతి పతాకం ఎగరేసిన మన తెలుగు వెలుగు, యుగపురుషుడు కారణజన్ముడు మన అన్న నందమూరి తారకరామా రావు పేరిట “ఎన్.టి.ఆర్ జిల్లా”, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగోడు గర్వపడే విధముగా తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం, స్వాగతిస్తున్నాము . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము''. అని నందమూరి రామకృష్ణ ప్రకటించారు.