అచ్చెన్న రక్త చరిత్రకు అవే ఆనవాళ్ళు…!

ఆయన చంద్రబాబు కుడిభుజం. ఆయన పక్కనే ఉంటారు. ఆయన మాటే మాట్లాడుతారు. ఎక్కడో దూరంగా దిక్కులేకుండా పడివున్న సిక్కోలు జిల్లా కంటే కూడా ఆయనకు అధినాయకుడు  చంద్రబాబూ, అమరావతి ఎక్కువైపోయాయి. అందుకే బాబుకు తానా…

ఆయన చంద్రబాబు కుడిభుజం. ఆయన పక్కనే ఉంటారు. ఆయన మాటే మాట్లాడుతారు. ఎక్కడో దూరంగా దిక్కులేకుండా పడివున్న సిక్కోలు జిల్లా కంటే కూడా ఆయనకు అధినాయకుడు  చంద్రబాబూ, అమరావతి ఎక్కువైపోయాయి. అందుకే బాబుకు తానా తందానా అంటారు.

చిత్రమేనంటే బాబుతో అచ్చెన్నకు భలే పోలికలు ఉన్నాయట. ఇద్దరి పేర్ల చివరా నాయుడు కామన్. ఇక  ఇద్దరూ రెండెకరాల అసాములే. ఇపుడు ఇద్దరి ఆస్తులు ఎంతో చెప్పడం ఎవరికైనా క‌ష్టమే.

ఇక శ్రీకాకుళంలో అచ్చెన్న మరో అడుగు ముందుకేసి రక్త చరిత్రకారుడిగా మిగిలారని వైసీపీ జిల్లా పార్లమెంటరీ పార్టీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. అచ్చెన్న రక్త చరిత్రకు ఆధారాలు, ఆనవాళ్ళు  ఆయన తలపైన ఉన్న గాయాల మచ్చలేనని  దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు.

అచ్చెన్న చేసిన అరాచకాలు అవి నిదర్శనమని కూడా అంటున్నారు. అచ్చెన్న రాజకీయంగా, ఆర్ధికంగా తాను బాగు పడ్డారు, కానీ సిక్కోలు  జిల్లా మాత్రం అలాగే ఉండాలన్న స్వార్ధంతోనే విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారని దువ్వాడ దుయ్యబెడుతున్నారు.

ఇన్నాళ్ళకు ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి చెందుతుంది అంటే కింజరపు కుటుంబం ఎందుకు స్వాగతించదూ అంటూ దువ్వాడ గట్టిగానే నిలదీస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల  రిగ్గింగుతో గెలిచిన ఎంపీ రామ్మోహననాయుడు కూడా విశాఖ రాజధానిని అడ్డుకోవడం అంటే ఇంతకంటే దారుణం వేరొకటి ఉండబోదని దువ్వడా అంటున్నారు.

విశాఖను రాజధానిగా ఎందుకు ఉండకూడదో చెప్పాలని, దీని మీద  అచ్చెన్న కుటుంబం చర్చకు రావాలని దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేస్తున్నారు. తాము మాత్రమే బాగుండాలని, జిల్లా జనం కష్టాలలో మగ్గిపోవాలనుకునే కింజరపు ఫ్యామిలీ బండారం చర్చకు వస్తే  బయటేస్తామని ఆయన అంటున్నారు.

మొత్తానికి సిక్కోలులో ఎదురులేకుండా ఉన్న కింజరపు కుటుంబానికి వైజాగ్ రాజధాని పెద్ద చిచ్చే రేపుతున్నట్లుగా ఉంది. జై అమరావతి అన్న టీడీపీ ఎమ్మెల్సీలు తొందరలో మాజీలవుతున్నారు. ఇపుడు అచ్చెన్న రాజకీయమేంటో చూడాలని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే

కండిషన్స్ అప్లై