ఇక్కడ చేతులు కలిపి అక్కడ కొట్టుకుంటారట

జనసేన-బీజేపీ పొత్తు సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే అనే విషయం తాజాగా బయటపడింది. Advertisement అవును.. ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేన… గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ముఖాముఖి…

జనసేన-బీజేపీ పొత్తు సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే అనే విషయం తాజాగా బయటపడింది.

అవును.. ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-జనసేన… గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ మేరకు జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చింది .

“గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించుకున్నారు. పలు డివిజన్లలో జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజల పక్షాన నిలిచాయి.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని నిలుపుతుంది.”

ఇలా ఎన్నికల్లో పోటీచేసే అంశంపై జనసేన అధినేత పవన్ విస్పష్ట ప్రకటన చేశారు. అయితే 150 డివిజన్లలో ఎన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబడతారనేది ఇంకా స్పష్టత రాలేదు.

బీజేపీతో పొత్తు మాత్రం ఉండదని తాజా ప్రకటనతో తేలిపోయింది. అటు బీజేపీ కూడా దుబ్బాక గెలుపుతో, ఒంటరిగానే బరిలోకి దిగాలని ఇదివరకే నిర్ణయించుకుంది.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఎత్తుగడపై భిన్నంగా స్పందిస్తున్నారు. బిహార్ లో ఎలాగైతే ఎన్డీఏ మిత్రపక్షాలు విడివిడిగా పోటీచేసి లాభపడ్డాయో.. అదే ఫార్ములాని జీహెచ్ఎంసీలో కూడా వర్తింపజేసేందుకు సిద్ధమౌతున్నట్టుంది.

బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.మొత్తమ్మీద తెలంగాణలో తొలిసారిగా జనసేన పార్టీ ఎన్నికల రణరంగంలో నిలిచింది.

తెలంగాణ సాధారణ ఎన్నికలను, అంతకంటే ముందు వచ్చిన గ్రేటర్ ఎన్నికలను మిస్ కొట్టిన పవన్.. ఈసారి మాత్రం బీజేపీ అండతో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో జనసేన సత్తా, పవన్ చరిష్మా ఏంటనేది మొన్నటి ఎన్నికలతో తేలిపోయింది. త్వరలోనే గ్రేటర్ లో పవన్ సత్తా ఏంటనేది తేలిపోతుంది. అన్నట్టు ఆటలో అరటిపండులా మారిన టీడీపీ ఏం చేయబోతోందనేది మరో ప్రశ్న. దానికి కూడా మరో 2 రోజుల్లో సమాధానం రాబోతోంది. 

విజన్ 2020 అంటే అర్థం చేసుకోలేకపోయాం