బాలకృష్ణతో ఒకటి కాదు, రెండు కాదు అంతకన్నా ఎక్కువ సినిమాలే తీసారు ఆ సీనియర్ నిర్మాత. ఆదిత్య 369, వంశానికొక్కడు, భలేవాడివి బాసూ, మిత్రుడు సినిమాల నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.
కానీ ఆ తరువాత ఆయన పెద్ద సినిమాలు వదిలి మీడియం సినిమాల మీదకు వచ్చేసారు. అయితే మళ్లీ బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
నాగశౌర్య లాంటి యంగ్ హీరో ఈ సినిమాలో నటిస్తారని, అదే సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ను బాలకృష్ణ చేస్తారని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ యంగ్ కొత్త డైరక్టర్ తీసుకువచ్చిన కథ రెడీగా వుందని తెలుస్తోంది.
నాగశౌర్య వైపు నుంచి అంతా ఓకె అని ఇక బాలకృష్ణ వైపు నుంచి ఓకె కావాల్సి వుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నాగశౌర్య చేతిలో చాలా సినిమాలు వున్నాయి.
అలాగే బాలకృష్ణ కూడా బోయపాటి డైరక్షన్ లో సినిమా చేయాల్సివుంది. ఇద్దరూ కొత్త ప్రాజెక్టుకు రెడీ కావాలంటే కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలు పడుతుందేమో?