అశ్వద్దామ యు/ఎ

నాగశౌర్య హీరోగా, హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ లో నిర్మించిన 'అశ్వద్ధామ' సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ గా తయారైన ఈ సినిమాకు కథకుడు కూడా నాగశౌర్యనే. ఈ సినిమాకు యు/ఎ…

నాగశౌర్య హీరోగా, హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ లో నిర్మించిన 'అశ్వద్ధామ' సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ గా తయారైన ఈ సినిమాకు కథకుడు కూడా నాగశౌర్యనే. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. చిన్న చిన్న కట్ ఇచ్చారు. మొత్తం నిడివి రెండు గంటల ఏడు నిమషాలు వచ్చింది.

థ్రిల్లర్ సినిమాలు ఎంత షార్ప్ గా వుంటే అంత బాగుంటాయి. ఇలాంటి నేపథ్యంలో అశ్వద్ధామ సినిమా జస్ట్ రెండు గంటల నిడివి రావడం మంచి విషయమే. మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు. 

ఈనెల 31న విడదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి. విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు అన్నది బేసిక్ పాయింట్. ఈ నేఫథ్యంలోనే నాగశౌర్య కథ రాసుకున్నారు. కొత్త దర్శకుడు రమణ తేజ ఈ కథకు రూపకల్పన చేసారు.

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ