ఇటీవల కాలంలో జనసేనాని పవన్‌కల్యాణ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌కు గురి అవుతున్నారు. ఇందుకు ఆయన రాజకీయ పంథా కూడా కారణమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాత్రమే రాజకీయంగా పవన్ టార్గెట్ చేస్తుండడం, చివరికి జనసేన శ్రేణులకి కూడా నచ్చడం లేదు. ఇది ముమ్మాటికీ పవన్ ఓర్వలేనితంగా సొంత వాళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల వైఖరులను ఎండగట్టాలని జనసేన నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అయితే తాను అనుకున్నది తప్ప, ఇతరుల మాటల్ని పరిగణలోకి తీసుకోవడం పవన్‌కు అలవాటు లేదు. దీంతో ఆయన వైఖరిపై జనసేన నేతలు, కార్యకర్తలు రోజురోజుకు విసిగిపోతున్నారు. తమకు అనుకూలంగా పవన్ నడుచుకుంటుండంతో ఎల్లో బ్యాచ్ తెగ ఆనందపడుతోంది.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వైఖరేంటో తేల్చాలని బీజేపీ పెద్దల్ని నిలదీసినట్టు కామెడీ స్టోరీ నడుపుతున్నారు. అప్పుడే తాను కర్నాటకలో ఎన్నికల ప్రచార విషయమై నిర్ణయం తీసుకుంటానని పవన్ తెగేసి చెప్పి వచ్చినట్టు జబర్దస్త్ స్క్రిప్ట్ ఒకటి టీడీపీ అనుకూల చానల్‌లో ప్రసారం చేయడం గమనార్హం. అసలు పవన్‌కు ఏపీలోనే దిక్కులేదని , అలాంటప్పుడు కర్నాటక తీసుకెళ్లి ఏం చేసుకుంటామని బీజేపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
ఏపీలో రెండు చోట్ల నిలబడి తానే గెలవలేని నాయకుడిని కర్నాటక తీసుకెళ్లి, ప్రచారం చేయిస్తే తెలుగు వాళ్లు ఓట్లు వేస్తారా? అని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. ఒకవేళ పవన్ కర్నాటక వెళ్లి ప్రచారం చేస్తే, ఆయన వ్యతిరేక తెలుగు ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని బీజేపీ ఆందోళన చెందుతోంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
పవన్‌ను సినిమా నటుడిగా అభిమానించే వాళ్లు కొంత వరకూ ఉండొచ్చని, అయితే వాళ్లెవరూ పవన్ రాజకీయ వైఖరిని సమర్థించడం లేదని అంటున్నారు. దీంతో పవన్‌కు అంత సీన్ లేదులే బాసూ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.