మన్మధుడు 2 ఇచ్చిన షాక్ తరువాత రియలైజేషన్ వచ్చింది హీరో నాగార్జునకు. తాను ఇంకా యంగ్, మన్మధుడు, సిక్స్ ఫ్యాక్ హీరో అన్న భ్రమల్లోంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఒకటి చేస్తున్నారు ఇప్పుడు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మించే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కు ప్రాధాన్యత వుంది. కానీ మన్మధుడు 2 లో రకుల్ మాదిరిగా మిడ్డీలు, చెడ్డీలు వేసుకు తిరిగే పాత్ర కాదు.
అందుకే చక్కగా నాగ్ పక్కన అతగాడి ఏజ్ కు సరిపోయేలా దియా మీర్జాను తీసుకున్నారు. దియా మరీ సీనియర్ హీరోయిన్ కాదు, అలా అని టీన్స్ లోనూ లేదు. పక్కాగా క్యారెక్టర్ కు సరిపోతుంది. దాదాపు నెలరోజులుగా సైలంట్ గా ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు.
ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఎ అధికారిగా కనిపిస్తారు. గగనం సినిమా తరవాత మళ్లీ నాగ్ ఈ విధంగా కాస్త డిఫరెంట్ సినిమా చేస్తున్నారు. ఆ మధ్య అలాంటి ప్రయత్నం చేసారు. కానీ ఆర్జీవీ పుణ్యమా అని అలా చేసిన ఆఫీసర్ కూడా నాగ్ కు చేదు అనుభవమే మిగల్చింది.