అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా నటించిన సినిమా `హీరో`. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పద్మావతి గల్లా నిర్మాత. జగపతిబాబు, నరేశ్ ,బ్రహ్మాజీ, మైమ్ గోపీ, రోల్ రిడా తదితరులు నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ, మొదటిరోజు దేవీ థియేటర్ లో చూశాక ప్రేక్షకుల పాజిటివ్ స్పందన ఇంకా మర్చిపోలేకపోతున్నా. అందుకే సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా ఇష్టం గ్రహించి నన్ను ఇంతవరకు తీసుకువచ్చిన అమ్మా, నాన్నలకు థ్యాంక్స్. అలాగే దర్శకుల టీమ్‌కు థ్యాంక్స్. జగపతిబాబుగారు చాలా బాగా చేశారు. బ్రహ్మాజీ క్లయిమాక్స్‌లో అదిరిపోయేలా నటించారు. అలాగే నరేష్, మైమ్ గోపీ, రోల్ రిడా పాత్రలు ఎంతగానో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. నిధి లక్కీచామ్‌గా తయారైంది. డాన్స్ పరంగా నాకు విజయ్ శిక్షణ ఇచ్చాడు. ఆయన చేసిన పాటలకు థియేటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. అన్నారు.
నిర్మాత పద్మావతి గల్లా స్పందిస్తూ, నాకు రెండురోజులుగా ఫీడ్‌బ్యాక్ వస్తూనే వుంది. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా. థ్రిలర్, కామెడీ సినిమాకు హైలైట్. దర్శకుడు కమర్షియల్ ఎంటర్టైనర్గా తీశాడు. పబ్లిసిటీకి సమయం లేకుండానే చేయాల్సివచ్చింది. అయినా ప్రేక్షకుల ఆదరణ మర్చిపోయేలా చేసింది. ముందుముందు మరింత పికప్ అవుతుందని నమ్ముతున్నాను. అన్నారు.
జయదేవ్ గల్లా మాట్లాడుతూ, సమిష్టి కృషి వల్ల ఈ సినిమా విజయం సాధించింది. అందరి కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని పేర్కొన్నారు. జగపతి బాబు మాట్లాడుతూ, నేను గత 15 ఏళ్ళుగా థియేటర్‌కు వెళ్ళలేదు. ఈ సినిమాకోసం వెళ్ళి చూశాను. పెద్దగా నవ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. మొదట్లో ఈ సినిమా చేయవద్దని అనుకున్నా.
పెద్ద సినిమాలలో నటించిన నాకు కొత్త హీరో, దర్శకుడుతో చేయాలనిపించలేదు. కానీ నిర్మాత పద్మ మా సోదిరికి ఒకటికి పదిసార్లు ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుందని ఒప్పించారు. సరేలే చేద్దాం అని చేశాను. సినిమా చేసేటప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ దర్శకుడు నా అంచనాలను తారుమారు చేసి ప్రేక్షకులు ఎంజయ్ చేసేలా చేశాడు అన్నారు.
శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ, థియటర్లలో నిజమైన పండుగలా వుంది. కష్టపడి చేసినందుకు ప్రేక్షకుల రియాక్షన్ మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మైమ్ గోపీ ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా పండించారు. అశోక్ పడిన కష్టం చక్కగా కనిపించింది. నిధి చాలా నాచురల్‌గా చేసింది. బ్రహ్మాజీ చివరి 10 నిముషాలు హైప్ కు తీసుకెళ్ళాడు. ఆయన పాత్ర రాసుకున్నపుడు డేట్స్ లేకపోయినా వేరే సినిమాకు సరిచేసి మాకు ఇచ్చారు. పాత్రపంగా ఆయన గట్టిగా అరుస్తాడు. అది థియటర్లో చూడాల్సిందే అని అన్నారు.
నటులు నరేష్, బ్రహ్మాజీ, రోల్ రైడా, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.