ఆధ్యాత్మిక మార్గంలో మెగా హీరో

ఓ పెద్ద ఎదురుదెబ్బ తర్వాత ఎవరికైనా కాస్త ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది. యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ కూడా ఇలానే భక్తి మార్గం వైపు మళ్లాడని చాలామంది అంటున్నారు. ఎక్కడ చూసినా చేతికి రుద్రాక్ష మాలను…

ఓ పెద్ద ఎదురుదెబ్బ తర్వాత ఎవరికైనా కాస్త ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది. యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ కూడా ఇలానే భక్తి మార్గం వైపు మళ్లాడని చాలామంది అంటున్నారు. ఎక్కడ చూసినా చేతికి రుద్రాక్ష మాలను పోలిన తాడు కట్టుకొని కనిపిస్తున్నాడు సాయితేజ్.

అయితే యాక్సిడెంట్ తో తనకు ఈ భక్తిభావం రాలేదంటున్నాడు సాయిధరమ్ తేజ్. తనకు చిన్నప్పట్నుంచి దేవుడిపై భక్తి ఉందని, కాకపోతే పూజలు తనకు ఇష్టం ఉండవని, దేవుడ్ని మాత్రం నమ్ముతానని అంటున్నాడు.

“ఇది నా చేతికి రోజూ ఉంటుంది. వర్కవుట్ చేస్తున్నప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు, షూటింగ్ టైమ్ లో మాత్రమే తీసి పక్కనపెడతాను. మిగతా టైమ్ మొత్తం నా చేతికే ఉంటుంది. మా అమ్మ ఇచ్చింది. నాకు మొదట్నుంచి దేవుడంటే నమ్మకం. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. నాకే ప్రాబ్లమ్ వచ్చినా ఆయనకు చెప్పుకుంటాను. అయితే దేవుడు ఇప్పటివరకు నాకు కలలోకి రాలేదు. అంత ఆధ్యాత్మిక బంధం నాకు ఏర్పడలేదు.”

ఇలా తన ఆధ్యాత్మిక ఆలోచనల్ని బయటపెట్టాడు సాయిధరమ్ తేజ్. తన తాత ఆంజనేయస్వామి భక్తుడని, ఆయన నుంచి అమ్మకు, అమ్మ నుంచి తనకు ఆ భక్తిభావం వచ్చిందంటున్న సాయితేజ్.. ప్రస్తుతం తను ఏది చేసినా, భవిష్యత్తులో ఏది చేయాలన్నా అది దేవుడి స్క్రిప్ట్ మాత్రమేనంటూ తనలోని వేదాంతాన్ని బయటపెట్టాడు.