దసరా…నైజాం..సూపర్..ఆంధ్ర ఓకె

హీరో నాని విపరీతంగా ప్రచారం చేసిన సినిమా దసరా. ఈ మధ్య కాలంలో పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు చేసిన సినిమా దసరా. నార్త్ లో పబ్లిసిటీకి రోజుకు లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి…

హీరో నాని విపరీతంగా ప్రచారం చేసిన సినిమా దసరా. ఈ మధ్య కాలంలో పబ్లిసిటీ కోసం భారీగా ఖర్చు చేసిన సినిమా దసరా. నార్త్ లో పబ్లిసిటీకి రోజుకు లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అక్కడ ఆ ప్రచారం ఏ మేరకు ఉపయోగపడిందన్నది అలా వుంచితే దాని ప్రభావం మాత్రం తెలుగు నాట బాగా కనిపించింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాను ఫాలో అయ్యే అర్బన్ సెంటర్లలో. ఇటు నైజాంలో, అటు ఆంధ్ర అర్బన్ సెంటర్లలో, ఓవర్ సీస్ లో నాని కెరీర్ లోనే అద్భుతమైన ఓపెనింగ్ కు ఈ పబ్లిసిటీ సహకరించింది.

ఇక సినిమా విడుదల తరువాత మాత్రం ఓవర్ సీస్ లో, నైజాంలో ఓన్ చేసుకున్నంతగా ఆంధ్రలో ఓన్ చేసుకోలేదు. మంచి ఫలితం అయితే ఇచ్చారు. కానీ బయ్యర్లకు కమిషన్లు వచ్చే రేంజ్ కు సినిమా చేరుతుందా అన్నది చూడాల్సి వుంది. నైజాంలో మాత్రం కలెక్షన్ల పంట పండింది. సినిమా దాదాపు 25 కోట్ల మేరకు చేసే అవకాశం వుంది. 

నైజాం బయ్యర్ దిల్ రాజుకు తొమ్మిది కోట్లకు దక్కాయి హక్కులు. కానీ అదే బయ్యర్ కు విశాఖ ఏరియా నాలుగు కోట్లకు పైగా పడింది. కానీ అక్కడ రెండున్నర కోట్ల మార్క్ దాటింది. ఇంకా ఖర్చులతో కలిపితే మరో రెండు కోట్లు చేయాల్సి వుంది. సరైన సినిమాలు లేకపోతే ఆ అవకాశం వుంటుంది. కానీ ఇకపై వారం వారం రెండేసి, మూడేసి సినిమాలు విడుదలవుతున్నాయి. ఎంత కాదన్నా కలెక్షన్లు కొంతయినా చెదిరిపోతాయి. లేదా వాటిల్లో ఒక్కటి హిట్ అనిపించుకున్నా సమస్య అవుతుంది.

సీడెడ్ లో దసరా అంతగా జనాలకు పట్టలేదంటే కారణం బహుశా లాంగ్వేజ్ అయి వుంటుందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. అథెంటిక్ తెలంగాణ మాండలీకం వాడడంతో జనాలకు కాస్త రీచ్ తక్కువ అయి వుంటుందని అనుకుంటున్నారు. ఆంధ్ర బి, సి సెంటర్లలో కూడా సరైన రన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు.

ఓవరాల్ గా చూసుకుంటే నిర్మాత చెరుకూరి సుధాకర్ ఓ హిట్ పడింది. నాని కి శ్యామ్ సింగ రాయ్ మాదిరిగా మంచి ప్రశంసలు దక్కాయి. కానీ జెర్సీ..శ్యామ్ సింగ రాయ్ ల మాదిరి పరిస్థితే దసరా ది కూడా. శ్యామ్ సింగరాయ్ కాస్ట్ ఫెయిల్యూర్. జెర్సీ బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చారు. కానీ రెండు సినిమాలు నాని కి మంచి పేరు తెచ్చాయి.