ఇర్కుపోయిన పవన్‌: విలీనమే బీజేపీ వ్యూహం.!

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహాల్లో చిక్కుకుపోయారా.? ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించి, విలీనం విషయమై ఆయన్ని ఇరకాటంలో పడేశారా.? అంటే అవునని చెప్పక తప్పదేమో.! హుటాహుటిన ఢిల్లీకి పవన్‌ కళ్యాణ్‌ పయనమయినప్పుడు,…

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహాల్లో చిక్కుకుపోయారా.? ఢిల్లీకి అత్యవసరంగా పిలిపించి, విలీనం విషయమై ఆయన్ని ఇరకాటంలో పడేశారా.? అంటే అవునని చెప్పక తప్పదేమో.! హుటాహుటిన ఢిల్లీకి పవన్‌ కళ్యాణ్‌ పయనమయినప్పుడు, జనసేన వర్గాలు.. 'మా అధినేత ఢిల్లీలో చక్రం తిప్పేస్తారు..' అని చెప్పుకున్నాయి. కానీ, ఢిల్లీ వెళ్ళాక, జనసేన శ్రేణులకు మీడియాకి మొహం చాటేయలేని పరిస్థితి ఏర్పడింది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడాక కూడా జనసేనాని, 'ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి మాత్రమే రాజధాని..' అంటూ ఘంటాపథంగా సెలవిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో, మూడు రాజధానుల విషయమై చర్చించలేదని పవన్‌ కళ్యాణ్‌ చెబితే, ఆ విషయం తమ దృష్టికి కేంద్ర ప్రభుత్వ పెద్దలెవరూ తీసుకురాలేదని బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన రఘురాం ఓ ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించడం గమనార్హం.

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెబుతున్న బీజేపీ, జనసేనతో కలిసి పోరాడతామని మాత్రం చెబుతోంది. ఇంకెందుకు పోరాటం.? అంటే, ఆ ప్రశ్నకు బీజేపీ వద్ద సమాధానం లేదు. కేంద్రం జోక్యం చేసుకోనప్పుడు, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడమేంటి.? అమరావతిని అడ్డుకుంటామని చెప్పడమేంటి.? అని జనసేనను ప్రశ్నిస్తే, జనసేన నుంచి సమాధానం రావడంలేదాయె.

ఇక, ఢిల్లీకి వెళ్ళిన పవన్‌ కళ్యాణ్‌కి ఈ రోజు ఎదురైన భిన్న పరిస్థితులు.. విలీనానికి సంకేతాలని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. 'పవన్‌ కళ్యాణ్‌ అడ్డంగా బుక్కయిపోయారు. బీజేపీతో పొత్తు విషయమై వెనక్కి తగ్గలేరు. అలాగని, అమరావతి విషయంలో గట్టిగా మాట్లాడి ప్రయోజనం లేదు. విలీనమొక్కటే జనసేనానికి శరణ్యం..' అంటూ రాజకీయ విశ్లేషకులు తాజా పరిస్థితిని అంచనా వేస్తున్నారు.

వాళ్ళ మంత్రులు వచ్చినపుడు కొట్టడానికి భలే వెళ్లారు శబాష్