సమంత మనసులో ఆ హీరో?

ప్రతి హీరోయిన్ కు కొన్ని కోరికలుంటాయి, అలానే కొన్ని డ్రీమ్ రోల్స్ కూడా ఉంటాయి. వాటి కోసం నిత్యం ఎదురుచూస్తుంటారు వాళ్లు. హీరోయిన్ సమంతకు కూడా అలాంటి ఓ కోరిక ఉంది. ఆమెకు డ్రీమ్…

ప్రతి హీరోయిన్ కు కొన్ని కోరికలుంటాయి, అలానే కొన్ని డ్రీమ్ రోల్స్ కూడా ఉంటాయి. వాటి కోసం నిత్యం ఎదురుచూస్తుంటారు వాళ్లు. హీరోయిన్ సమంతకు కూడా అలాంటి ఓ కోరిక ఉంది. ఆమెకు డ్రీమ్ రోల్స్ అంటూ పెద్దగా లేవు కానీ, ఆమె మనసులో ఓ డ్రీమ్ హీరో మాత్రం ఉన్నాడు. అతడే ఫహాద్ ఫాజిల్.

మలయాళంలో స్ట్రయిట్ సినిమా చేస్తే ఫహాద్ ఫాజిల్ తో నటించాలనే కోరికను వ్యక్తం చేసింది సమంత. ఆల్రెడీ ఓ సినిమాలో ఫహాద్ తో నటించినప్పటికీ, అది చాలా తక్కువ పోర్షన్ మాత్రమేనని, అది తనకు చాలదని, ఫహాద్ తో ఫుల్ లెంగ్త్ సినిమాలో నటించాలని ఉందంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది.

మలయాళంలో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ, ఇలా తన కోరికను బయటపెట్టింది శామ్. మలయాళం సినిమాల్ని చూసి తను చాలా నేర్చుకున్నానని, ఏదో ఒక రోజు నేరుగా మలయాళంలో సినిమా చేస్తానని, అయితే ఆ సినిమాలో ఫహాద్ హీరోగా నటిస్తే తనకు ఇంకా హ్యాపీ అని ప్రకటించింది.

సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. సౌత్ లాంగ్వేజెస్ తో పాటు, హిందీలో ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా గడిపేస్తోంది సమంత.