సంక్రాంతికి ఫిక్స్ అయిన ‘ఫ్యామిలీ స్టార్’

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా ఫ్యామిలీ స్టార్.. సంక్రాంతికే విడుదల అని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. అందులో ఫస్ట్ లుక్ ఇస్తున్నట్లు, షూటింగ్ సగానికి పైగా…

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా ఫ్యామిలీ స్టార్.. సంక్రాంతికే విడుదల అని నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చేసారు. ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. అందులో ఫస్ట్ లుక్ ఇస్తున్నట్లు, షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని, సంక్రాంతికి విడుదల అంటూ అన్నీ చెప్పేసారు. దీంతో ఇప్పుడు సంక్రాంతికి పక్కా వస్తుంది అన్న సినిమాల జాబితా రెండుకు పెరిగింది. 

ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం వుండనే వుంది. ఇంకా చాలా సినిమాలు సంక్రాంతి అని ప్రకటించి వున్నాయి కానీ ముందుకో, వెనక్కో జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. హనుమాన్ కాస్త ముందుకు వస్తుంది, ఈగిల్ కాస్త వెనక్కు వెళ్తుందని టాక్ వుంది. నాగ్ సినిమా ఇంకా ఇప్పుడే శ్రీకారం చుట్టారు. అందువల్ల దాని గురించి ఇప్పుడే క్లారిటీ రాదు. 

వెంకీ సైంధవ్ సినిమా సంక్రాంతికి వేసే ఆలోచనలో వున్నారు అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సలార్ డేట్ అఫీషియల్ గా బయటకు వస్తే, అప్పుడు సంక్రాంతి సినిమాల సంగతి తేలుతుంది.

మరో రెండు సినిమాల వరకు సంక్రాంతికి స్పేస్ వుంది. అవి ఏ సినిమాలు అవుతాయో చూడాలి. వెంకీ, నాగ్ ఇలాంటి హీరోల సినిమాలు అయితే గుంటూరు కారం సినిమాకు అంత టెన్షన్ వుండక్కరలేదు. కానీ హనుమాన్, ఈగిల్ వస్తే మాత్రం కలెక్షన్లు కాస్త బాగా డివైడ్ అవుతాయి.