వైష్ణవ్ తేజ్ vs బాపినీడు ?

యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా మీద తకరారు నడుస్తోంది. వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమాను బోగవిల్లి బాపినీడు కు చేస్తున్నారు. అది జరుగుతోంది. ఇదిలా వుంటే అదే హీరోతో…

యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా మీద తకరారు నడుస్తోంది. వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమాను బోగవిల్లి బాపినీడు కు చేస్తున్నారు. అది జరుగుతోంది. ఇదిలా వుంటే అదే హీరోతో అదే బ్యానర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ కాంబినేషన్ లో మరో సినిమా ప్లానింగ్ లో వుంది. అయితే ఇది నాలుగో సినిమాగానా, తరువాత నా అన్నది క్లారిటీ లేదు.

ఇలాంటి నేపథ్యంలో సితార బ్యానర్ లో దర్శకుడు త్రివిక్రమ్ స్వంత బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ తో కలిపి వైష్ణవ్ తేజ్ తో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. అక్కడ సమస్య స్టార్ట్ అయింది. నాలుగో సినిమా కూడా మాకే చేయాలి అని నిర్మాత బాపినీడు పట్టు పట్టినట్లు తెలుస్తోంది.

తాను మరో సినిమా చేస్తా అన్నాను కానీ, నాలుగోదా? అయిదోదా? అన్న కమిట్ మెంట్ ఇవ్వలేదు. ఎక్కడా అగ్రిమెంట్ సంతకం చేయలేదు అని హీరో అన్నట్లు తెలుస్తోంది. దీని మీద చాలా మల్లగుల్లాలు నడచినట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఆగిపోయింది.

ఈసాయంత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ వుంటుందన్న నిర్మాణ సంస్థ, అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తానికి నిర్మాత వైఖరి పట్ల హీరో వైష్ణవ్ తేజ్ కాస్త అసంతృప్తిగా వున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.