ఆమె ఓ పార్ట్ టైమ్ హీరోయిన్. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ లేకపోయినా, తనకున్న బ్యాకింగ్ వల్ల ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పుడీమె పెళ్లి విషయంలో సమంతను ఫాలో అవుతోంది.
పెళ్లయిన ఈ హీరోయిన్ పై ఈమధ్య తెగ పుకార్లు వస్తున్నాయి. భర్తతో ఆమె విడిపోయిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆమె పరోక్షంగా నిర్థారిస్తూ, ఈమధ్య సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేసింది. సరిగ్గా గతంలో సమంత కూడా ఇలానే చేసింది.
నాగచైతన్య-సమంత విడిపోతున్నారంటూ ఊహాగానాలు మొదలైన టైమ్ అది. అప్పటివరకు సోషల్ మీడియాలో అంతంతమాత్రంగా ఉన్న సమంత, ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. వరుసగా ఫొటోషూట్స్ లో పాల్గొంది. ఆ పిక్స్ ను స్టేటస్ లో పెట్టుకుంది. డ్రెస్సింగ్ స్టయిల్ కూడా మార్చేసింది. కాస్త గ్లామరస్ గా కనిపించే ఫొటోలు పెట్టింది.
ఆ తర్వాత కొన్నాళ్లకు తన ప్రొఫైల్ నేమ్ నుంచి అక్కినేని అనే ఇంటి పేరును తొలిగించింది. ఆ తర్వాత మెల్లగా నాగచైతన్యతో విడిపోయిన విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడిదే ఫ్లో ను ఈవిడ కూడా ఫాలో అవ్వాలనుకుంటోంది.
ఇనస్టాగ్రామ్ లో దాదాపు 3 నెలలుగా స్తబ్దుగా ఉన్న ఈమె, ఇప్పుడిప్పుడే మళ్లీ ఫొటోషూట్స్ మొదలుపెట్టింది. వీలైతే మళ్లీ సినిమాలు కూడా చేయాలనుకుంటోంది. భర్త నుంచి దాదాపు విడిపోవడంతో ఆమె ఇలా మళ్లీ యాక్టివ్ అయిందంటున్నారు చాలామంది.
ఈ ఫ్లో చూస్తుంటే, రేపోమాపో ఆమె తన విడాకులపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామ్ కే వాస్తే ఆ ప్రకటన ఏదో ఇచ్చేసి, మళ్లీ ఫ్రెష్ గా కొత్త లైఫ్ మొదలుపెట్టాలనుకుంటోందామె. ఈసారి యాక్టింగ్ తో పాటు, ఓటీటీలో ప్రొడక్షన్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటోంది.