నిన్న మొన్నటి వరకు మే..జూన్..జూలై,..ఆగస్ట్ వరకు విడుదల డేట్ లు లాక్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు అక్టోబర్ అంటే దసరా సీజన్ పని మొదలైంది. ఆగస్ట్ లో వద్దాం అనుకున్నా డేట్ సెట్ కాక వెనక్కు వుండిపోయిన్ రామ్ పోతినేని..బోయపాటి సినిమా డేట్ ను దసరా కు అనౌన్స్ చేసారు.
దసరా పండుగ అక్టోబర్ 21 న మొదలవుతోంది. అష్టమి..నవమి… దశమి 22..23..24..ఈ తేదీలకు ముందుగా వచ్చే శుక్రవారం రామ్-బోయపాటి సినిమాకు ముహుర్తంగా నిర్ణయించారు.
ఇక్కడ పాయింట్ ఏమిటంటే బోయపాటి, అలాగే ఆ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీను ముహుర్తాల విషయంలో చాలా కీలకంగా వుంటారు. తుమ్మినా..దగ్గినా కూడా ముహుర్తం కావాలి. రోజూ ఇంటి బయటకు కాలు పెట్టాలన్నా వర్జ్యం, దుర్ముహర్తం చూసుకోవాల్సిందే. అంత కీలకంగా నమ్మకాలు వున్నవారు పెట్టే ముహుర్తం కచ్చితంగా సూపర్ గా వుంటుందనే అనుకోవాలి.
కానీ ఇక్కడే గమ్మత్తు ఒకటి వుంది. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కూడా దసరా కే. దానికి డేట్ కావాల్సి వుంది. ఇదే డేట్ అన్నది బాలయ్య ముందే ఆలోచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బాలయ్యకు ఇటు బోయపాటి, అటు చిట్టూరి శ్రీను కన్నా ముహుర్తాల నమ్మకం ఎక్కువ.
కానీ బాలయ్య కు ఎందుకో 20 శుక్రవారం రోజు ముహుర్తం అంత బాలేదనిపించిదట. దాంతో మరోటి చూద్దాం అని ఆగిపోయారు. బాలయ్య ముహుర్తం పెడితే అనిల్ రావిపూడి సినిమా డేట్ బయటకు వస్తుంది.