ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి పృథ్వీరాజ్ రాజీనామా

ఎట్ట‌కేల‌కు ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి   పృథ్వీరాజ్ రాజీనామా చేశాడు. దీంతో టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న చాన‌ల్‌లో వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్టైంది. చానల్ మ‌హిళా ఉద్యోగితో పృథ్వీ అస‌భ్యంగా మాట్లాడిన‌ట్టు ఆదివారం ఉద‌యం నుంచి అన్ని…

ఎట్ట‌కేల‌కు ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వికి   పృథ్వీరాజ్ రాజీనామా చేశాడు. దీంతో టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న చాన‌ల్‌లో వివాదానికి ముగింపు ప‌లికిన‌ట్టైంది. చానల్ మ‌హిళా ఉద్యోగితో పృథ్వీ అస‌భ్యంగా మాట్లాడిన‌ట్టు ఆదివారం ఉద‌యం నుంచి అన్ని చాన‌ళ్ల‌లో ఆడియో ప్ర‌సార‌మైంది. దీనిపై టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సీరియ‌స్‌గా స్పందించారు. వెంట‌నే విజిలెన్స్‌కు ఆదేశించారు. ఇదే సంద‌ర్భంలో పృథ్వీ వ్య‌వ‌హారాన్ని సీఎం జ‌గ‌న్ దృష్టికి వైవీ తీసుకెళ్లాడు. సీఎం ఆదేశాల మేర‌కు పృథ్వీ రాజీనామా చేశాడు.

త‌న రాజీనామా విష‌యాన్ని విలేక‌రుల స‌మావేశంలో పృథ్వీ స్వ‌యంగా ప్ర‌క‌టించాడు. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించాడు. 

తాను ఎస్వీబీసీ చైర్మన్‌గా 2019 జూలై 28న ప్రమాణం స్వీకారం చేశానని, త‌న‌కు ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు పార్టీ నాయ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. త‌న‌ను దెబ్బతీయడం కోసమే కొంద‌రు కుట్ర‌లు చేసిన‌ట్టు ఉంద‌న్నారు.  

నకిలీ  వాయిస్‌ పెట్టి త‌న‌పై దుష్ప్రచారం చేశార‌న్నాడు. తాను మద్యం మానేసి చాలా కాలమైంద‌న్నాడు. పద్మావతి అమ్మవారి పవిత్ర స్థలంలో మందు తాగుతున్న‌ట్టు చెడు ప్రచారం చేశారన్నాడు. వైద్యులతో త‌న‌కు పరీక్షలు చేసినా సిద్ధ‌మే అన్నాడు.