ఎన్టీఆర్‌ అభిమానులా… మజాకా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న #NTR30 సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత‌గానే ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఎక్క‌డి వెళ్లిన #NTR30 సినిమా అప్‌డేట్ అంటూ ఫ్యాన్స్ గోల చేస్తునే ఉన్నారు.…

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న #NTR30 సినిమా గురించి ఫ్యాన్స్ ఎంత‌గానే ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఎక్క‌డి వెళ్లిన #NTR30 సినిమా అప్‌డేట్ అంటూ ఫ్యాన్స్ గోల చేస్తునే ఉన్నారు. ఇటీవ‌ల ఓ ఇవెంట్ లో పాల్లొన్న ఎన్టీఆర్ సినిమా అప్‌డేట్ చేపేశారు. 

ఈ క్ర‌మంలో యూఎస్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వినూత్నంగా విషెస్ చెప్పారు. 'థ్యాంక్యూ ఎన్టీఆర్… #NTR30 కోసం వేచి ఉండ‌లేక‌పోతున్నాం' అనే బ్యాన‌ర్ ను ఎయిర్ జెట్ ద్వారా గాల్లో ఎగురవేశారు. కాగా ఈనెల 23న పూజా కార్య‌క్ర‌మంతో సినిమా స్టార్ట్ కానునున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించింది.

ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సెట్స్ మీద ఉండగానే కొరటాల శివతో కమిటయ్యారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండటం అభిమానుల్లో నిరాశే నింపింది. ఇటీవ‌ల స్వ‌యంగా ఎన్టీఆర్ నే సినిమా గురించి అప్‌డేట్ ఇవ్వ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. 

కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు మూవీ యూనిట్ ఇటీవ‌లే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నారు.