ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన ఆమె, 16న గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఇవాళ విచారణకు వెళ్తారా? లేక తన గతంలో లాగా లాయర్ ను పంపుతారా? అనే ఆంశంపై ఉత్కంఠ నెలకొంది.
మహిళను ఇంటి వద్దే విచారించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ 24న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ పిటిషన్ తేలేవరకు ఈడీ విచారణకు వెళ్లొద్దని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తొంది. కాగా ఇప్పటికే ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి ఆమె ఢిల్లీకి వెళ్లారు. కవిత వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని ఈడీ భావిస్తోంది. కాగా, ఈ నెల 11న కవితను 9 గంటల పాటు విచారించిన ఈడీ.. పలు కీలక విషయాలను సేకరించింది. ఈ సారి కవితను విచారించి వదిలేస్తారా..? లేక అరెస్టు చేస్తారా..? అనేది పొలిటికల్ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది.