చరణ్ ..ఎవరిదీ క్రియేటివిటీ?

రామ్ చరణ్ కు ఇటీవల పబ్లిసిటీ మోజు భయంకరంగా పట్టేసింది. ముంబాయిలో ఒకటికి రెండు ఏజెన్సీలను అపాయింట్ చేసి మరీ స్టోరీలు, ఫొటోలు ఒకదాని వెంట మరోటి వదులుతున్నారు. పబ్లిసిటీ పీక్స్ లో వుండేలా…

రామ్ చరణ్ కు ఇటీవల పబ్లిసిటీ మోజు భయంకరంగా పట్టేసింది. ముంబాయిలో ఒకటికి రెండు ఏజెన్సీలను అపాయింట్ చేసి మరీ స్టోరీలు, ఫొటోలు ఒకదాని వెంట మరోటి వదులుతున్నారు. పబ్లిసిటీ పీక్స్ లో వుండేలా చూసుకుంటున్నారు. ఉదయం లేస్తే వార్త..ఫొటో…మళ్లీ మధ్యాహ్నం. సాయంత్రం ఇలా అస్సలు వదలడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సాయంత్రం ఓ ఫోటో వదిలారు. దాన్ని తయారుచేసిన వారి క్రియేటివిటీకి జోహార్లు చెప్పాల్సిందే.

ఫొటోలు రామ్ చరణ్ స్టయిల్ గా టేబుల్ మీద‌ కూర్చుని వున్నారు. టేబుల్ మీద కొత్తగా వచ్చిన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ (ఆయనకు రాకపోయినా) అవార్డులు వున్నాయి. కిందన నేల మీద చరణ్ కాళ్ల దగ్గర ఓ పక్కన ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరోపక్కన గౌరవ మైన నందీ అవార్డులు పెట్టారు. 

ఎంత దారుణం ఇది? ఎంత చిన్న చూపు మన నంది అవార్డు అంటే. అంతే కాదు మన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లు కూడా కాళ్ల దగ్గర పడేసారు.

ఆఖరికి చిరంజీవి పూజించే అంజ‌నీ పుత్రుడి బొమ్మ వున్న కొణిదేల బ్యానర్ సింబల్ వున్న ప్రింట్ లు కూడా కాళ్ల దగ్గర నేలపైనే వుంచారు. ఏమిటిది? ఎవరికి క్రియేటివిటీ ఇది?