సామ్ నీల్ కు బ్లడ్ క్యాన్సర్!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హాలీవుడ్‌ చిత్రం 'జూరాసిక్ పార్క్' మూవీలో న‌టించిన న‌టుడు సామ్ నీల్ బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం క్యాన్స‌ర్ థ‌ర్డ్ స్టేజ్ లో ఉంద‌ని…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన హాలీవుడ్‌ చిత్రం 'జూరాసిక్ పార్క్' మూవీలో న‌టించిన న‌టుడు సామ్ నీల్ బ్ల‌డ్ క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం క్యాన్స‌ర్ థ‌ర్డ్ స్టేజ్ లో ఉంద‌ని దాని కోసం చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. త‌న జీవితం గురించి పుస్తకం రాయ‌డం ప్రారంభించాన‌ని త‌న చావు అతి ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌ని అందుకోసం వేగంగా త‌న గురించి పుస్త‌కం రాస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం క్యాన్స‌ర్ తో ఉన్న స్నేహితులు, బంధువుల‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డం ఇష్ట‌మైన‌ప్పటికీ తానేమి చేయ‌లేక‌పోతున్న‌ట్లు అవేద‌న వ్యక్తం చేశారు. 1977లో వచ్చిన స్లీపింగ్ డాగ్స్ చిత్రంలో తొలిసారిగా గుర్తింపు పొందిన ఆయ‌న 1993లో వచ్చిన “జురాసిక్ పార్క్” చిత్రంలో లెగ్రాంట్ పాత్రలో ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాధించుకున్నారు.

భారీ జంతువులు, రాకాసి బల్లులు చేసే హడావిడి, భయానక దృశ్యాలతో రూపొందిన హాలీవుడ్‌ చిత్రం ‘జురాసిక్‌ పార్క్‌’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించి ఆరు సీక్వెల్స్‌ వచ్చాయి. గత ఏడాది ఆరో సీక్వెల్‌ ‘జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌’ విడుదలైంది.